Page Loader
ఆటో ఎక్స్‌పో 2023లో 10-సీట్ల టాటా మ్యాజిక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రదర్శించిన టాటా మోటార్స్
ఈ వాహనం ధర సుమారు రూ. 9.9 లక్షలు ఉండచ్చు

ఆటో ఎక్స్‌పో 2023లో 10-సీట్ల టాటా మ్యాజిక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రదర్శించిన టాటా మోటార్స్

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 18, 2023
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2023లో సరికొత్త మ్యాజిక్ EVని ప్రదర్శించింది. భారతదేశంలో ప్రధానంగా పాఠశాలలు, స్టేజ్ క్యారేజ్, అంబులెన్స్‌లు వంటి డెలివరీ సేవలను లక్ష్యంగా చేసుకుంది. ఈ ఆల్-ఎలక్ట్రిక్ మినీవాన్ బ్రాండ్ EVOGEN పవర్‌ట్రెయిన్ తో నడుస్తుంది. భారతీయ మార్కెట్‌లోని మూడవ స్థానంలో ఉన్న టాటా మోటార్స్ కు వాణిజ్య ఎలక్ట్రిక్ వాహన విభాగాలలో అతిపెద్ద మార్కెట్ వాటా ఉంది. ఈ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా కొత్త BEV (బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్) మోడళ్లను పరిచయం చేస్తోంది. ఇప్పుడు ప్రధానంగా వాణిజ్యపరమైన సేవల కోసం ఈ మ్యాజిక్ ఎలక్ట్రిక్ మినివాన్‌ను ప్రదర్శించింది,

కార్

ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యంతో బ్యాటరీ ఒక ఛార్జ్ కి 140 కిమీ వరకు నడుస్తుంది

వాహనానికి సంబంధించిన సాంకేతిక వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యం ఉన్న బ్యాటరీ ఒక ఛార్జ్ కి 140కిమీల వరకు నడుస్తుంది. ఇందులో విశాలమైన 10-సీటర్ క్యాబిన్‌, మాన్యువల్ AC, 7.0- నుండి మినిమలిస్ట్ డ్యాష్‌బోర్డ్ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో ఉన్న 7.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ తో పాటు వెనుక కెమెరా ఉంది. ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. ఈ వాహనం ధర, ఇతర వివరాల తయారీసంస్థ రాబోయే వారాల్లో ప్రకటించే అవకాశం ఉంది. Ace EV కంటే ఈ ఆల్-ఎలక్ట్రిక్ మినీవ్యాన్ ప్రీమియం ధరతో అంటే సుమారు రూ. 9.9 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది.