ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కన్నా లీజు లాభం అంటున్న ఫ్లీట్ ఆపరేటర్లు
టాక్సీ, లాజిస్టిక్స్ కంపెనీలు వంటి ఫ్లీట్ ఆపరేటర్లు ఎలక్ట్రిక్ వాహనాల్ని ఎక్కువగా లీజుకి తీసుకుంటున్నారు. టాప్ బ్యాంకులు ఎలక్ట్రిక్ వాహనాలకు ఫైనాన్స్ ఇవ్వడానికి విముఖత చూపడంతో లీజుకి తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మహీంద్రా ఫైనాన్స్, ఒరిక్స్ లీజింగ్ సంస్థలు ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు లీజు ఇస్తున్నాయి. వచ్చే 2 నుండి 3 ఏళ్లలో ఈ వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాయి. టాటా క్యాపిటల్, సుమిటోమో మిట్సుయ్ ఫైనాన్స్ & లీజింగ్, ALD లీజ్‌ప్లాన్, Reyfin వంటి సంస్థలు ఫ్లీట్ ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఎలక్ట్రిక్ వాహనాల లీజింగ్ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. Orix సంస్థ గత ఏడాది 50 కార్లను లీజుకు తీసుకుంది, ఈ సంవత్సరం 300 కార్లను లీజుకు తీసుకుంది.
లీజు వ్యవధి తరవాత కొనుగోలు చేసే సదుపాయం
వాహనాలను లీజుకు ఇవ్వడం వలన ఫ్లీట్ ఆపరేటర్‌లు తమ నిధులను వాహనాల్ని కొనడానికి ఖర్చు చేయడం కన్నా వ్యాపారంలో ఇతర అవసరాలకు ఖర్చు చేసే అవకాశం ఉంది. అయితే లీజు వ్యవధి తర్వాత వాహనాలను కొనుగోలు చేసే సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. లీజుకి తీసుకోవడం వలన కస్టమర్లకు ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఫ్లెక్సిబిలిటీతో సహా అనేక ప్రోత్సాహకాలు అందుతాయి. టాటా మోటర్స్ బ్లూ స్మార్ట్ మొబిలిటీ సంస్థతో కలిసి దేశ రాజధాని ప్రాంతంలో ఉన్న అన్ని రైడ్ షేరింగ్ కంపెనీలకు ఎలక్ట్రిక్ వాహనాలను సప్లై చేయాలనీ నిర్ణయించింది. బ్లూ స్మార్ట్ దగ్గర ప్రస్తుతం 3,000 కార్లు ఉంటే వచ్చే సంవత్సరానికి 25,000 కార్లు తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది.