Page Loader
Mahindra vehicles: డిసెంబర్‌లో మహీంద్రా వాహనాల అమ్మకాల్లో 16శాతం వృద్ధి
డిసెంబర్‌లో మహీంద్రా వాహనాల అమ్మకాల్లో 16శాతం వృద్ధి

Mahindra vehicles: డిసెంబర్‌లో మహీంద్రా వాహనాల అమ్మకాల్లో 16శాతం వృద్ధి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2025
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిసెంబర్‌ నెలలో మహీంద్రా వాహనాలకు గణనీయమైన డిమాండ్‌ కనిపించింది. మహీంద్రా అందించిన వివరాల ప్రకారం, 2024 డిసెంబర్‌ నెలలో మొత్తం 69,768 వాహనాలు విక్రయించగా, ఎగుమతులతో కలిపి 16శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయంగా 41,424 ఎస్‌యూవీ వాహనాలను విక్రయించి, 18శాతం వృద్ధిని సాధించింది. విదేశాలకు 19,502 వాహనాలు ఎగుమతి చేసింది. డిసెంబర్‌లో 18% వృద్ధితో 41,424 ఎస్‌యూవీలు విక్రయించామని మహీంద్రా ఆటోమోటివ్‌ డివిజన్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ నక్రా తెలిపారు. అన్ని వేరియంట్లలో కలిపి 69,768 వాహనాలు అమ్ముడయ్యాయని, ఆటోమొబైల్‌ రంగంలో డౌ జోన్స్‌ సస్టైనబిలిటీ ఇండెక్స్‌ వరల్డ్‌ లీడర్‌గా గుర్తింపును పొందడం గర్వకారణమని చెప్పారు. గత ఆగస్టులో మహీంద్రా తన కొత్త 5-డోర్ థార్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

Details

థార్‌ రాక్స్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు

అక్టోబర్‌ 3న బుకింగ్స్‌ ప్రారంభమయ్యి, దసరా నుంచి డెలివరీలు మొదలయ్యాయి. థార్‌ రాక్స్‌ విపణిలో కొత్త రికార్డులను సృష్టించింది. ఈ వాహనంలో 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 160 బీహెచ్‌పీ శక్తిని, 330 ఎన్ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. థార్‌ రాక్స్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, లేన్‌ కీప్‌ అసిస్టెంట్‌, అడాప్టివ్‌ క్రూజ్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్స్‌ ఉన్నాయి. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో సపోర్ట్‌ వంటి ఫీచర్లతో పాటు 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, 9-స్పీకర్ హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్‌ వంటి అనేక ఆప్టిమైజ్డ్‌ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.