Page Loader
Hyundai Nexo 2025: 179 కి.మీ వేగం, 700 కి.మీ రేంజ్.. హ్యుందాయ్ నెక్సో అదరగొట్టేసింది!
179 కి.మీ వేగం, 700 కి.మీ రేంజ్.. హ్యుందాయ్ నెక్సో అదరగొట్టేసింది!

Hyundai Nexo 2025: 179 కి.మీ వేగం, 700 కి.మీ రేంజ్.. హ్యుందాయ్ నెక్సో అదరగొట్టేసింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2025
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న వేళ, హ్యుందాయ్ మరో ముందడుగు వేసింది. సియోల్ మొబిలిటీ షో 2025లో ఈ కంపెనీ తన రెండో తరం నెక్సో (NEXO) మోడల్‌ను పరిచయం చేసింది. ఇది ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FCEV) విభాగంలో ఒక కొత్త శకానికి నాంది పలికేలా ఉంది. ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు హ్యుందాయ్ ఇనిటియమ్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించిన ఈ నెక్సో SUV అక్టోబర్ 2024లో LA ఆటో షోలో డెబ్యూ చేసింది. 'ఆర్ట్ ఆఫ్ స్టీల్' డిజైన్ లాంగ్వేజ్‌ ఆధారంగా బాక్సీ రూపం, ఆర్చ్-షేప్ క్రాస్ సెక్షన్‌లతో ప్రత్యేకంగా తయారయ్యింది.

Details

అత్యాధునిక ఫీచర్లు

ముందుభాగంలో నాలుగు చుక్కల లైట్లు, బ్లాక్-పాటర్న్ లైటింగ్, ఎయిర్ డ్యామ్, బంపర్ మౌంటెడ్ లైట్లు దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. మూడు-కోట్ల పెయింటింగ్ పద్ధతి వాడడం వల్ల, దీని కలర్ షేడ్లు కూడా మారుతూ కనిపిస్తాయి. రంగుల ఎంపిక నెక్సోకు గోయో కాపర్ పెర్ల్, ఓషన్ ఇండిగో మ్యాట్, అమెజాన్ గ్రే మెటాలిక్, క్రీమీ వైట్ పెర్ల్, ఫాంటమ్ బ్లాక్ పెర్ల్, ఎకోట్రానిక్ గ్రే పెర్ల్ వంటి ఆరు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Details

 ఇంటీరియర్ & టెక్నాలజీ 

ఈ SUV ఇంటీరియర్ పాలిసేడ్, శాంటా ఫే SUVల డిజైన్ ప్రేరణతో చాలా మోడ్రన్‌గా ఉంది. డ్యాష్‌బోర్డ్‌తో కలిసేలా ఉన్న ట్విన్ డెక్ సెంటర్ కన్సోల్, స్టీరింగ్ కాలమ్‌పై గేర్ సెలెక్టర్ వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణ. 14-స్పీకర్ బ్యాంగ్ & ఒలుఫ్సెన్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, NFC ఆధారిత కీ లెస్ ఎంట్రీ, డిజిటల్ IRVMలు, కెమెరా ఆధారిత ORVMలు, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 12.3 అంగుళాల డిస్‌ప్లేలు వంటి అధునాతన టెక్నాలజీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Details

సురక్షిత ప్రయాణానికి Level 2 ADAS

ఫార్వర్డ్ కొలిషన్-అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ కొలిషన్-అవాయిడెన్స్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ వ్యూయర్ మానిటర్, ఎమర్జెన్సీ స్టాప్, నావిగేషన్ ఆధారిత స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ వంటి లెవెల్ 2 ADAS ఫీచర్లతో నెక్సో ప్రయాణాన్ని మరింత సురక్షితంగా చేస్తోంది. పవర్‌ట్రెయిన్, పనితీరు నెక్సో 150 kW ఎలక్ట్రిక్ మోటార్, 110 kW ఫ్యూయల్ సెల్ స్టాక్‌తో రానుంది. ఈ మోటార్ 201 హార్స్ పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2.64 kW లిథియం అయాన్ బ్యాటరీ శక్తిని అందిస్తుంది. ఇది 700 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

Details

7.8 సెకన్లలోనే 100 కి.మీ వేగం

గరిష్ట వేగం 179 కిలోమీటర్లు/గంట కాగా, 0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 7.8 సెకన్లలో చేరుతుంది. హ్యుందాయ్ రెండో తరం నెక్సో SUV ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కార్లకు ఒక సాంకేతిక విప్లవంగా నిలుస్తోంది. అద్భుతమైన శక్తి సామర్థ్యం, ఆధునిక ఫీచర్లు, భద్రతా ప్రమాణాలతో ఇది మార్కెట్లో గణనీయమైన ప్రాధాన్యతను సంపాదించనుంది.