Page Loader
భారతదేశంలో విడుదల కానున్న 2023 బి ఎం డబ్ల్యూ M2
M3, M4 మోడల్‌ల లాగానే కొత్త గ్రిల్ డిజైన్‌ తో వస్తుంది.

భారతదేశంలో విడుదల కానున్న 2023 బి ఎం డబ్ల్యూ M2

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 25, 2023
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

బి ఎం డబ్ల్యూ గత ఏడాది అక్టోబర్‌లో గ్లోబల్ మార్కెట్ల కోసం M2 2023 వెర్షన్‌ను ప్రకటించింది. ఇప్పుడు ఈ వెర్షన్ మే లో భారతదేశానికి వస్తుందని వెల్లడించింది. ఇది M3, M4 మోడల్‌ల లాగానే కొత్త గ్రిల్ డిజైన్‌ తో వస్తుంది. బి ఎం డబ్ల్యూ భవిష్యత్తు కోసం ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. ఈ M2 దాని ఐకానిక్ "M" విభాగం నుండి విడుదల కాబోతున్న చివరి ICE వాహనం అని తయారీ సంస్థ ధృవీకరించింది. దాని మిగతా మోడల్స్ మాదిరిగానే, 2023 బి ఎం డబ్ల్యూ M2 అడాప్టివ్ M సస్పెన్షన్ యూనిట్‌లతో వస్తుంది.

కార్

సిస్టమ్ రైడింగ్ డైనమిక్‌ మూడు ప్రీసెట్ మోడ్‌లతో వస్తుంది

ఎలక్ట్రానిక్-నియంత్రిత షాక్ అబ్జార్బర్‌లలో స్టెప్‌లెస్ అడ్జస్ట్ మెంట్స్ ఉంటాయి. సిస్టమ్ రైడింగ్ డైనమిక్‌ మూడు ప్రీసెట్ మోడ్‌లతో వస్తుంది: కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్+. బి ఎం డబ్ల్యూ M2 బ్రాండ్ సరికొత్త iDrive 8 సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో కర్వ్డ్ స్క్రీన్ సెటప్‌ ఉంది, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 12.3-అంగుళాల యూనిట్, ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ కోసం 14.9-అంగుళాల యూనిట్ ఉంది. సిస్టమ్ బ్లూటూత్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి తాజా కనెక్టివిటీ ఆప్షన్స్ అందిస్తుంది. 2023 బి ఎం డబ్ల్యూ M2 3.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, ఇన్‌లైన్-సిక్స్ ఇంజన్ తో నడుస్తుంది.