Page Loader
2023 హోండా CB350 RS vs రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఏది కొనడం మంచిది
రెండింటిలో డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ ABS ఉన్నాయి

2023 హోండా CB350 RS vs రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఏది కొనడం మంచిది

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 13, 2023
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపనీస్ తయారీసంస్థ హోండా తన ప్రసిద్ధ ఆఫర్ అయిన CB350RS ను భారతదేశంలో MY-2023 అప్‌డేట్‌లతో అప్‌గ్రేడ్ చేసింది. మార్కెట్లో రెట్రో మోటార్‌సైకిల్ కేటగిరీలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350తో పోటీ పడుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 2023కి ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు రెండు బైక్‌లకు వివిధ ఆప్షన్లతో అందుబాటులో ఉండడం వలన కొనుగోలుదారులకుఏదో ఒకటి ఎంచుకోవడం సవాలుగా మారింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో 13-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, రౌండ్ హాలోజన్ హెడ్‌ల్యాంప్, రిబ్బెడ్-ప్యాటర్న్ సీట్, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. హోండా CB350RS డిజైన్ 15-లీటర్ ఇంధన ట్యాంక్, సింగిల్-పీస్ సీటు, సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్ ఉన్నాయి.

బైక్

రెండు మోటార్‌సైకిళ్లలో డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ ABS ఉన్నాయి

రైడర్ భద్రత కోసం రెండు మోటార్‌సైకిళ్లలో డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ ABS ఉన్నాయి అయితే, హోండా CB350 RSలో సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) వ్యవస్థను కూడా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350కి 349cc, ఎయిర్-కూల్డ్, J-సిరీస్, సింగిల్-సిలిండర్ ఇంజన్ సపోర్ట్ ఉంది. హోండా CB350RS 348.6cc, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన, సింగిల్-సిలిండర్ మిల్లు ద్వారా నడుస్తుంది. భారతదేశంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ధర రూ.1.5 లక్షలు నుండి రూ.1.72 లక్షలు, అయితే 2023 హోండా CB350RS రూ. 2.14 లక్షలు నుండి రూ.2.17 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ఉంటుంది. శక్తివంతమైన ఇంజన్ తో, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ తో ఉన్న హోండా CB350RS కొనడం మంచిది