అధికారిక లాంచ్‌కు ముందే 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ చిత్రాలు లీక్
ఈ వార్తాకథనం ఏంటి
హోండా కార్స్ ఇండియా 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి రూ. 21,000 టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే, 2023 సిటీ అధికారిక లాంచ్ కి ముందు, అప్‌డేట్‌ల గురించి వివరాలను తెలియజేస్తూ ఆన్‌లైన్‌లో చిత్రాలు లీక్ అయ్యాయి.
లీకైన చిత్రాలను బట్టి చూస్తే 2023 హోండాసిటీలో పెద్దగా మార్పులు లేవని స్పష్టమవుతోంది. డిజైన్‌కు సంబంధించినంతవరకు పెద్ద మార్పులు రావు, ఎందుకంటే ఇది మిడ్-లైఫ్ అప్‌డేట్ పూర్తి మోడల్ మార్పు కాదు.
హోండాసిటీ ఫేస్‌లిఫ్ట్ 6-స్పీడ్ MT, CVT ఆటోమేటిక్ ఆప్షన్స్ తో 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే వస్తుంది.
కార్
హోండా సిటీ e:HEV (హైబ్రిడ్)లో మరిన్ని వేరియంట్‌లు వస్తాయి
అంతేకాకుండా, హోండా సిటీ e:HEV (హైబ్రిడ్)లో మరిన్ని వేరియంట్‌లు వస్తాయి. ఇది ప్రస్తుతం ఒకే ట్రిమ్, ZX లో అందుబాటులో ఉంది, దీని ధర రూ. 19.89 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ప్రస్తుతం, నాన్-హైబ్రిడ్ హోండాసిటీ ధర రూ. 11.87 లక్షల నుంచి రూ. 15.62 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 2023 హోండా సిటీ ధరలు బహుశా రూ. 12 లక్షల నుండి రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండచ్చు.
హోండాసిటీ ఫేస్‌లిఫ్ట్ ఫిబ్రవరి చివరి నాటికి డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంటుంది, మార్చి 2న షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుంది.