Page Loader
2023 హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్) v/s 2022 ఐదవ జనరేషన్ మోడల్
2023 హోండా సిటీ వెర్షన్ రూ.11.49 లక్షలు తో ప్రారంభం

2023 హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్) v/s 2022 ఐదవ జనరేషన్ మోడల్

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 03, 2023
07:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపనీస్ సంస్థ హోండా భారతదేశంలోని 2023 హోండా సిటీ వెర్షన్ ను రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో ప్రారంభించింది. ప్రస్తుత మోడల్ కు రూ.37,000 తేడాతో కొన్ని చిన్న అప్డేట్ లతో మార్కెట్లోకి వచ్చింది. భారతదేశంలో తన 25వ వార్షికోత్సవం సంధర్భంగా హోండా ఐదవ జనరేషన్ వెర్షన్‌ను చిన్న మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్‌తో అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించుకుంది. అప్డేట్ అయిన సెడాన్‌లో "హోండా సెన్సింగ్" సేఫ్టీ సూట్‌తో పాటు రీడిజైన్ చేసిన బంపర్‌లు, రివైజ్డ్ గ్రిల్ డిజైన్ ఉన్నాయి. అయితే భిన్నంగా, కొత్త మోడల్ తక్కువ ధరతో అందుబాటులో ఉంది. . 2023 హోండా సిటీ అదే 1.5-లీటర్, ఇన్‌లైన్-ఫోర్ పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది. 1.5-లీటర్, స్వీయ-ఛార్జింగ్, పెట్రోల్-హైబ్రిడ్ సెటప్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ తో నడుస్తుంది.

కార్

ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-కీప్ అసిస్ట్ వంటి సరికొత్త ఫీచర్స్ తో వచ్చిన 2023 సిటీ ఫేస్ లిఫ్ట్

అప్‌డేట్ అయిన సెడాన్ లో డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో ఉన్న 8.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫంక్షన్‌లతో ఉన్న "హోండా సెన్సింగ్" ADAS సూట్‌ ఉంది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ హోండా సిటీ ప్రారంభ ధర రూ. 11.87 లక్షలు, 2023 మోడల్ భారతదేశంలో 11.49 లక్షల (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. 2023 సిటీ ఫేస్ లిఫ్ట్ రిఫ్రెష్ అయిన డిజైన్ తో సరికొత్త ADAS ఫంక్షన్లతో, తక్కువ ప్రారంభ ధరతో 2022 ఐదవ జనరేషన్ మోడల్ కంటే మెరుగ్గా ఉంది.