
Tesla: 2023 టెస్లా మోడల్ 3 డిజైన్‌లో సరికొత్త మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
దిగ్గజ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కార్లు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యం పొందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
టెస్లా మోడల్ 3లో సరికొత్త మార్పులు చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఈవీలో కొత్త LED, DRLలు, ర్యాప్‌రౌండ్ C-ఆకారపు LED టెయిల్‌లైట్‌లతో మరింత అకర్షణీయంగా రూపొందించారు.
అల్ట్రా రెడ్, స్టెల్త్ గ్రే, లైనప్ ను ఇందులో అమర్చారు. లోపల మినిమలిస్ట్ డాష్‌బోర్డ్ కోసం ర్యాప్-అరౌండ్ డిజైన్‌ను ఏర్పాటు చేశారు.
అల్యూమినియం ట్రిమ్‌లు, స్థిరమైన ఫాబ్రిక్ మెటీరియల్‌లను ఈ ఈవీ కలిగి ఉంది.
యాంబియంట్ లైటింగ్, మెరుగైన సౌండ్‌ఫ్రూఫింగ్ కోసం కొత్త డిజైన్ వల్ల క్యాబిన్‌లో ప్రయాణికులకు కొంత అనుభూతి కలగనుంది.
Details
టెస్లా మోడల్ 3 ధరపై స్పష్టత ఇవ్వని కంపెనీ
వెనుక ప్రయాణీకుల కోసం, ఇంటిగ్రేటెడ్ నియంత్రణలతో 8.0-అంగుళాల డిస్ప్లే కూడా ఉంది. ఈ టెస్లా మోడల్ 3 ధరను సంస్థ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
అక్టోబర్‌లో చివరిలో ఐరోపాలో డెలవరీలను సంస్థ ప్రారంభించనుంది. ప్రస్తుతం గిగాఫ్యాక్టరీ షాంఘైలో ఈ కార్ల ఉత్పత్తి జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ టెస్లా గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
మరోవైపు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇండియాలో కార్ల తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.