Page Loader
యూరోపియన్‌లో మార్కెట్లోకి 2024 జీప్ రాంగ్లర్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్! 
యూరోపియన్‌లో మార్కెట్లోకి 2024 జీప్ రాంగ్లర్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్!

యూరోపియన్‌లో మార్కెట్లోకి 2024 జీప్ రాంగ్లర్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 13, 2023
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికన్ ఆటో మొబైల్ బ్రాండ్ జీప్ యూరోపియన్ మార్కెట్ కోసం 2024 రాంగ్లర్‌ను పరిచయం చేసింది. ఈ కారులో ఫీచర్లను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ వాహనం ఫీచర్ల గురించి తెలుసుకుందాం. ఇందులో ఆఫ్-రోడర్ సొగసైన డిజైన్, అధునాతన సాంకేతికత సిస్టిమ్‌తో ముందుకు రానుంది. 2024 మొదటి అర్ధ భాగంలో ఈ వాహనం డెలివరీలను ఆ సంస్థ ప్రారంభించనుంది. 2024 రాంగ్లర్‌లో రీడిజైన్ చేసిన, సెవెన్-స్లాట్ గ్రిల్, బ్లాక్ టెక్స్‌చర్డ్ స్లాట్లు, న్యూట్రల్ గ్రే మెటాలిక్ బెజెల్స్ ఉన్నాయి. ట్రయల్-రెడీ స్టీల్త్ యాంటెన్నా ఫ్రంట్ విండ్‌షీల్డ్‌లో దీన్ని విలీనం చేశారు.

Details

2024 జీప్ రాంగ్లర్ లో అధునాతన ఫీచర్లు

ఆఫ్-రోడ్-బయాస్డ్ టైర్‌లతో వీటి అల్లాయ్ వీల్స్‌ ప్రయాణిస్తాయి. లోపల, విశాలమైన క్యాబిన్‌లో స్టాండర్డ్ 12.3-అంగుళాల "Uconnect 5" టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రౌసీ డ్రైవర్ అలర్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ట్రాఫిక్ సైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి బహుళ ADAS ఫంక్షన్‌లున్నాయి. ఇది ఒకే హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులో ఉంది. యూరోపియన్ రాంగ్లర్‌లో 4xe హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ అందుబాటులో ఉంది. నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను హైబ్రిడ్ సిస్టమ్‌తో కలిపి, మొత్తం 380hp అవుట్‌పుట్‌ను అందిస్తుంది. డ్రైవర్లు తమ అవసరాలకు అనుగుణంగా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ వెహికల్ జర్మనీ, ఇటలీ, పోలాండ్, స్పెయిన్ వంటి యూరోపియన్ మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది.