2024 KTM 390 డ్యూక్ వివరాలు లీక్.. ఆసక్తికర విషయాలు వెల్లడి
కేటీఎం త్వరలో 390 డ్యూక్ ను సరికొత్త మార్పులతో తీసుకొస్తోంది. స్టైలిష్ లుక్‌తో కేటీఎం 390 బైకును జులైలో మార్కెట్లో లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ బైక్ పై మార్కెట్లో అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈబైక్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు లీక్ అయ్యాయి. BMW G 310 R, TVS Apache RR 310 వంటి బైకులకు పోటీగా కేటీఎం 390 బైకును రీడిజైన్ చేయాలని సంస్థ భావించింది. రాబోయే KTM 390 డ్యూక్ బ్రాండ్ ఎడ్జీ డిజైన్ ఫిలాసఫీని అనుసరిస్తుంది. అవుట్‌గోయింగ్ మోడల్ కంటే షార్ప్‌గా కనపించనుంది. ఇందులో ఫ్యూయల్ ట్యాంక్, స్ప్లిట్-టైప్ DRLలు, వెడల్పు హ్యాండిల్ బార్, స్ప్లిట్ సీట్లు, వెనుకవైపు బోల్ట్-ఆన్ సబ్‌ఫ్రేమ్, LED టెయిల్లాంప్ ఉంటాయి.
వచ్చే నెలలో కేటీఎం 390 బైక్ లాంచ్
రైడర్స్ భద్రత కోసం KTM 390 డ్యూక్ రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది, దాంతో పాటు డ్యూయల్-ఛానల్ ABS ఒక కార్నరింగ్ ఫంక్షన్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. ఈ బైక్ 399సీసీ ఇంజిన్ తో వస్తోంది. లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ తో పాటు ఇది గరిష్టంగా 43hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులో ఆరు గేర్లు ఉండనున్నాయి. 2024 KTM 390 డ్యూక్ బైక్ ను వచ్చే నెలలో లాంచ్ చేసే అవకాశముంది. లాంచ్ సమయంలో ఈ బైక్ గురించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఈ బైకు ధర రూ. 2.96 లక్షలు ఉండనుంది.