TVS రోనిన్ vs కీవే ఎస్ఆర్ 250.. ఏదీ కొనడం బెటర్ ఆప్షన్!
కీవే సంస్థ ఈ ఏడాది జనవరిలో భారతదేశంలో కీవే ఎస్ఆర్ 250 మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ బైకు అత్యాధునిక ఫీచర్లతో యూత్‌ను అకట్టుకుంటోంది. దీనికి ప్రత్యర్థిగా టీవీఎస్ రోనిన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ బైకుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ రెండు బైకుల్లో ఏ బైక్ కొనాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 8నెలల వ్యవధిలో 8 కొత్త ఆఫర్లతో కీవే సంస్థ బైకులను తీసుకొచ్చింది.ఈ జాబితాలో రెండు 300సీసీ స్కూటర్లు, రెండు క్రూయిజర్ మోటార్‌సైకిళ్లు, రెండు స్క్రాంబ్లర్లు, ఒక స్ట్రీట్‌ఫైటర్, ఒక సూపర్‌స్పోర్ట్ ఉన్నాయి. ప్రస్తుతం ఎస్ఆర్ 250 మోడల్ బైకులను డెలివరీ చేస్తోంది. టీవీఎస్ రోనిన్ కీవేఎస్ఆర్ 250 బైకుకు గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్లో అంచనాలు వెలువడుతున్నాయి.
కీవే ఎస్ఆర్ 250 కంటే టీవీఎస్ రోనిన్ బెటర్
కీవే ఎస్ఆర్ 250లో 14.2-లీటర్ ఇంధన ట్యాంక్, ఒక రౌండ్ హెడ్‌ల్యాంప్, ఒక అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్, ఒక వృత్తాకార టెయిల్‌ల్యాంప్ యూనిట్, సింగిల్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 17-అంగుళాల వైర్-స్పోక్డ్ వీల్స్ ఉన్నాయి. TVS రోనిన్ నియో-రెట్రో డిజైన్‌ను కలిగి ఉంది. టియర్‌డ్రాప్-ఆకారపు 14-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, ఇంటిగ్రేటెడ్ T- ఆకారపు DRLతో కూడిన రౌండ్ LED హెడ్‌ల్యాంప్, రిబ్డ్-ప్యాటర్న్ సీటు, అల్లాయ్ వీల్స్, సొగసైన LED టెయిల్‌లైట్లతో ముందుకొస్తోంది. భారతదేశంలో కీవే SR 250 ధర రూ. 1.49 లక్షలు ఉండగా.. TVS రోనిన్ రూ. 1.69 లక్షలు ఉంది. కీవే SR 250 పోలిస్తే టీవీఎస్ రోనిన్ బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు.