హీరో ప్యాషన్ ప్లస్ Vs బజాజ్ ప్లాటినా 100.. రెండిట్లో ఏదీ బెస్ట్..?
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హీరో మోటో కార్పర్ అప్‌డేట్ వర్షెన్ ప్యాషన్ ప్లస్‌ను తీసుకొచ్చింది. ఈ బైక్ త్వరలోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్ బజాబ్ ప్లాటినా 100కు గట్టి పోటినిస్తుందని మార్కెట్లో అంచనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఈ రెండింట్లో ఏదీ బెస్ట్ బైక్ మనం తెలుసుకుందాం.. హీరో ఫ్యాషన్ ప్లస్‌లో మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, సెమీ ఫైర్డ్ హెడ్ ల్యాంప్, ఫ్లాట్ టైప్ సీట్, వైడ్ హ్యాండిల్ బార్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్లు ఉండనున్నాయి. బజాజ్ ప్లాటీనా 100లో స్కల్ప్ టెడ్ ఫ్యూయెల్ ట్యాంక్, రైజెడ్ హ్యాండిల్ బార్, హాలో జెన్ హెడ్ ల్యాంప్, సింగిల్ పీస్ సీట్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తున్నాయి.
బజాజ్ ప్లాటీనా 100 ఎక్స్‌షోరూం ధర రూ. 67,808
మరోవైపు బజాజ్ ప్లాటీనా100లో 102 సీసీ, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ డీటీఎస్-ఐ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.8 హెచ్ పీ పవర్‌ను, 8.3 ఎన్ ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఈ రెండు బైకుల్లో ఫ్రెంట్, రేర్ వీల్స్ కు డ్రమ్ బ్రేక్స్ రానున్నాయి. ముఖ్యంగా కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టెమ్ ఫీచర్ కూడా ఉంది. ఫ్రెంట్ సైడ్‌కు టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో డ్యూయెల్ షాక్ అబ్సార్బర్స్ వంటివి సస్పెషన్స్ డ్యూటీ చేస్తాయి. ఇండియాలో హీరో ప్యాషన్ ప్లస్ ఎక్స్‌షోరూం ధర రూ. 72,076గా ఉంది. అదే సమయంలో బజాజ్ ప్లాటీనా 100 ఎక్స్‌షోరూం ధర రూ. 67,808గా ఉంది.