Page Loader
2024 మెర్సిడెస్-బెంజ్ GLA v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనడం మంచిది
SUV బాడీ స్టైల్ కు ఈమధ్య డిమాండ్ బాగా పెరిగింది

2024 మెర్సిడెస్-బెంజ్ GLA v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనడం మంచిది

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 20, 2023
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

మెర్సిడెస్-బెంజ్ తన ఎంట్రీ-లెవల్ SUV GLAని MY-2024 అప్‌డేట్‌లతో గ్లోబల్ మార్కెట్‌లలో విడుదల చేయనుంది. మార్కెట్లో ఈ సెగ్మెంట్ లో బి ఎం డబ్ల్యూ X1తో పోటీ పడుతుంది. SUV బాడీ స్టైల్ కు ఈమధ్య డిమాండ్ బాగా పెరిగింది. బి ఎం డబ్ల్యూ X1 భారతదేశంలో ఎంట్రీ-లెవల్ ప్రీమియం SUV సెగ్మెంట్‌లో మొదటి మోడల్. ఇప్పుడు ఆడి Q3, మెర్సిడెస్-బెంజ్ GLA వంటి బ్రాండ్లు కూడా ఇందులో ప్రవేశించాయి. బి ఎం డబ్ల్యూ X1 1.5-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్, 2.0-లీటర్, నాలుగు-సిలిండర్ డీజిల్ మిల్లుతో నడుస్తుంది. మెర్సిడెస్-బెంజ్ GLAకి 48V హైబ్రిడ్ సిస్టమ్‌తో 2.0-లీటర్, నాలుగు-సిలిండర్, టర్బోచార్జ్డ్ మోటారు తో నడుస్తుంది.

కార్

హైబ్రిడ్ ఇంజన్ తో, విశాలమైన క్యాబిన్‌తో మెర్సిడెస్-బెంజ్ GLA సరైన ఎంపిక

బి ఎం డబ్ల్యూ X1లో డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, వైర్‌లెస్ ఛార్జర్, 10.7-అంగుళాల iDrive 8 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో విశాలమైన క్యాబిన్‌ ఉంటుంది. మెర్సిడెస్-బెంజ్ GLAలో పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, MBUX OSతో డ్యూయల్ 10.3-అంగుళాల స్క్రీన్ సెటప్‌తో టెక్-ఫార్వర్డ్ క్యాబిన్ ఉంది. ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫంక్షన్‌ ఉన్నాయి. భారతదేశంలో, 2023 బి ఎం డబ్ల్యూ X1 రూ.45.9 లక్షలు నుండి రూ. 47.9 లక్షలు మధ్య అందుబాటులో ఉంది., అయితే 2024 మెర్సిడెస్-బెంజ్ GLA ప్రస్తుత మోడల్ ధర రూ. 46.5 లక్షల కంటే ఎక్కువ ఉండచ్చు. శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజన్ తో, విశాలమైన క్యాబిన్‌తో మెర్సిడెస్-బెంజ్ GLA సరైన ఎంపిక.