2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 v/s 2022 మోడల్
స్వదేశీ బైక్ తయారీసంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలో MY-2023 అప్‌గ్రేడ్‌లతో దాని ప్రసిద్ధ మోడల్ ఇంటర్‌సెప్టర్ 650ని అప్డేట్ చేసింది. మోటార్ సైకిల్ ఇప్పుడు ప్రారంభ ధర రూ. 3.03 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇంటర్‌సెప్టర్ 650 2018 నుండి మిడిల్‌వెయిట్ రెట్రో-థీమ్ మోటార్‌సైకిల్ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రవేశపెట్టిన మోటార్‌సైకిల్. ఇప్పుడు, కంపెనీ బైక్‌ను ప్రస్తుత అవసరాలకు తగట్టు పూర్తిగా రిఫ్రెష్ చేసింది. 2023 ఇంటర్‌సెప్టర్ 650 2022 మోడల్ రెట్రో డిజైన్ తోనే వస్తుంది. ఇందులో టియర్‌డ్రాప్ ఇంధన ట్యాంక్, రౌండ్ LED హెడ్‌లైట్ యూనిట్, ఎత్తైన హ్యాండిల్‌బార్, డ్యూయల్ అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్‌లు, సింగిల్-పీస్ సీటు, ట్యూబ్యులర్ గ్రాబ్ రైల్, ఫోర్క్ గైటర్‌లు, స్క్వేర్డ్-అవుట్ LED టెయిల్‌లాంప్ ఉన్నాయి.
రైడర్ భద్రత కోసం డ్యూయల్-ఛానల్ ABSతో పాటు డిస్క్ బ్రేకులు ఉన్నాయి
2022 మోడల్ లాగానే, 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 రైడర్ భద్రత కోసం డ్యూయల్-ఛానల్ ABSతో పాటు ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 OBD-2 కంప్లైంట్ 648cc, సమాంతర-ట్విన్ ఇంజన్ తో నడుస్తాయి. భారతదేశంలో, 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ఇప్పుడు కాన్యన్ రెడ్, కాలి గ్రీన్ పెయింట్ స్కీమ్‌ల ధర రూ.3.03 లక్షలు, సన్‌సెట్ స్ట్రిప్, బ్లాక్ పెర్ల్ ఆప్షన్‌ల ధర రూ.3.11 లక్షలు. బ్లాక్ రే, బార్సిలోనా బ్లూ పెయింట్ జాబ్‌ల ధర రూ. 3.21 లక్షలు, మార్క్ 2 ధర రూ.3.31 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). ప్రస్తుతం బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.