Page Loader
2024 స్కోడా సూపర్బ్ వర్సెస్ టయోటా క్యామీ.. ఏదీ బెటర్..? 
2024 స్కోడా సూపర్బ్ వర్సెస్ టయోటా క్యామీ.. ఏదీ బెటర్..?

2024 స్కోడా సూపర్బ్ వర్సెస్ టయోటా క్యామీ.. ఏదీ బెటర్..? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2023
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియాలో ఆటో మొబైల్ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వివిధ కార్ల కంపెనీలు తమ మోడల్స్ ఫీచర్స్, లాంచ్ తేదీ వివరాలను రివీల్ చేస్తున్నాయి. ఇప్పటికే స్కోడా తన ప్లాగ్ షిప్ ఎస్‌యూవీ '2024 స్కోడా సూపర్బ్' కారును తాజాగా ఆవిష్కరించింది. నాల్గవ తరం కోసం సెడాన్ లిఫ్ట్‌బ్యాక్, ఎస్టేట్ అవతార్‌లలో అందుబాటులోకి రానుంది. దీనికి పోటీగా మార్కెట్లోకి 'టయోటా క్యామ్రీ' వచ్చింది. ఈ రెండు కార్లలో ఏది బెటరో ఇప్పుడు తెలుసుందాం. టయోటా క్యామ్రీలో వాలుగా ఉండే రూఫ్‌లైన్, మస్కులర్ బానెట్, రీస్టైల్ చేసిన గ్రిల్, LED DRLలతో కూడిన సొగసైన LED హెడ్‌లైట్లు, క్రోమ్-లైన్డ్ విండోస్, బూట్ లిడ్ స్పాయిలర్, ర్యాప్-అరౌండ్ టెయిల్‌లైట్లు, 18-అంగుళాల డిజైనర్ వీల్స్ ఉన్నాయి.

Details

'స్కోడా సూపర్బ్' లో సరికొత్త ఫీచర్లు

SUPERB 2001లో ప్రవేశపెట్టినప్పటి నుండి SKODA ఎక్కువగా ప్రజాదరణ పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక ప్రీమియం SUVలను ఉపయోగిస్తున్న కొన్ని సెడాన్‌లలో ఇది కూడా ఒకటి. 2024 SKODA SUPERBలో స్లోపింగ్ రూఫ్‌లైన్, DRLలతో కూడిన స్వెప్ట్‌బ్యాక్ అడాప్టివ్ LED హెడ్‌ల్యాంప్‌లు, సరికొత్త 19-అంగుళాల డిజైనర్ వీల్స్, సొగసైన LED టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి. టొయోటా క్యామ్రీలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్‌ప్లే, మూడు-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన విలాసవంతమైన క్యాబిన్‌ను కలిగి ఉంది. ఇండియాలో టయోటా క్యామ్రీ ధర రూ. 46.17 లక్షలు ఉండగా, స్కోడా సూపర్బ్ రూ.37.29 లక్షలు ఉంది.