2024 టయోటా వెల్‌ఫైర్ మినీవాన్ v/s 2023 మోడల్.. రెండిట్లో ఉన్న ఫీచర్లు ఇవే!
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టయోట గత వారం 2024 వెల్‌ఫైర్ మినీవాన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. గతంలో వారం ఈ వెహికల్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ వాహనం కొనుగోలు కోసం డీలర్ షిప్ వద్ద రూ.2-5 లక్షలు లోపు చెల్లించి రిజర్వ్ చేసుకొనే అవకాశం ఉంది. ఈ విలాసవంతమైన మినీవ్యాన్ టెక్-లోడెడ్ క్యాబిన్, శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్‌తో ముందుకొస్తోంది. ఇందులో స్లైడింగ్ డోర్లు, ట్రై-బ్లాక్ LED హెడ్‌ల్యాంప్‌లు, మల్టీ-స్పోక్ వీల్స్, ర్యాప్-అరౌండ్ టెయిల్‌ల్యాంప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొత్త టొయోటా వెల్‌ఫైర్ 2.4-లీటర్, నాలుగు-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్ (275hp/430Nm), e-CVT గేర్‌బాక్స్‌తో దీన్ని అనుసంధానం చేశారు. ఇది 2.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో నడుస్తుంది.
టయోటా వైల్ ఫైర్ ధర రూ.96.5 లక్షలు
మినీవ్యాన్‌లో ఓవర్ హెడ్ కన్సోల్, ఆరు సీట్లు ఉన్నాయి. పుల్-డౌన్ సన్‌షేడ్‌లతో ప్రీమియం క్యాబిన్, లైటింగ్, వెంటిలేషన్ నియంత్రణలతో కూడిన పెద్ద ఓవర్‌హెడ్ కన్సోల్, బహుళ AC వెంట్‌లు, మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంది. పెద్ద ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా అందించనుంది.ప్రయాణికుల భద్రత కోసం బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు ఉండనున్నాయి. భారతదేశంలో 2024 టయోటా వెల్‌ఫైర్ డెలివరీలు సెప్టెంబర్ చివరిలో ప్రారంభమవుతాయి. దీని ధర ఎక్స్ షో రూం ధర రూ. 96.5 లక్షలు ఉండనుంది.