Page Loader
2024 సీ-హెచ్ఆర్ ఎస్‌యూవీ రివీల్ చేసిన టయోటా.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
సీ-హెచ్ఆర్ ఎస్‌యూవీని రివీల్ చేసిన టయోటా

2024 సీ-హెచ్ఆర్ ఎస్‌యూవీ రివీల్ చేసిన టయోటా.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 26, 2023
06:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టయోటా 2024 సీ-హెచ్ఆర్ ఎస్‌యూవిని తాజాగా ఆవిష్కరించింది. యూరప్ లో ఇప్పటికే ఈ మోడల్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఎస్‌యూవీ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ఈ టయోటా ఎస్‌యూవీకి సూపర్ కూపే ఫ్రొపైల్ ఉండనుంది. ఇందులో వైడ్​ బంపర్​, మస్క్యులర్​ హుడ్​, ఫ్లష్​ ఫిట్టెడ్​ డోర్​ హ్యాండిల్స్​, డైమెంట్​ కట్​ లైన్స్​, 20 ఇంచ్​ స్టైలిష్​ వీల్స్, సీ షేప్​ స్వెప్ట్​ బ్యాక్​ హెడ్​లైట్స్​​ వంటివి లభిస్తున్నాయి. ఇక రేర్​లో షార్క్​ ఫిన్​ యాంటీనా, ఫుల్​ విడ్త్​ టెయిల్​ల్యాంప్​లు రానుండడం విశేషం. అదే విధంగా ఈ ఎస్​యూవీలో 64 కలర్​ యాంబియెంట్​ లైటింగ్​, హెడ్​-అప్​ డిస్​ప్లే, జేబీఎల్​ సౌండ్​ సిస్టెమ్​, డిజిటల్​ కీ వంటివి కూడా వస్తున్నాయి

Details

టయోటా సీ-హెచ్ ఆర్ ఎక్స్ షోరూం ధర రూ.36.5 లక్షలు

సెకండ్​ జనరేషన్​ టయోటా సీ- హెచ్​ఆర్​ ప్రీమియం కేబిన్​లో రీసైకిల్డ్​ ప్లాస్టిక్​తో తయారు చేసిన అప్​హోలిస్ట్రీ, ఇన్​ఫ్రారెడ్​ రెడ్యూసింగ్​ కోటింగ్​తో కూడిన పానోరమిక్​ సన్​రూఫ్​ వంటివి రానుండడం గమనార్హం. వేసవి కాలంలో ఓవర్​హిట్​ నుంచి శీతాకాలంలో ఓవర్​కూలింగ్​ నుంచి ఈ ఎస్‌యూవీ రక్షణ కల్పించనుంది. అంతేకాకుండా ఈ ఎస్​యూవీలో 64 కలర్​ యాంబియెంట్​ లైటింగ్​, హెడ్​-అప్​ డిస్​ప్లే, జేబీఎల్​ సౌండ్​ సిస్టెమ్​, డిజిటల్​ కీ వంటివి ప్రత్యేకంగా రానున్నాయి. 2024 టయోటా సీ-హెచ్ ఆర్ ఎక్స్ షోరూం ధర రూ.35,000 పౌండ్లు ఉండనుంది. అంటే సూమారుగా 36.5 లక్షలుగా ఉంది.