Page Loader
టెస్ట్​ రన్ దశలో మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే?
టెస్ట్​ రన్​ దశలో మారుతీ సుజుకీ తొలి ఈవీ

టెస్ట్​ రన్ దశలో మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2023
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియాలో ఈవీ సెగ్మెంట్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకూ దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ మాత్రం ఈ సెగ్మెంట్‌లో ఒక్క మోడల్ కూడా తీసుకురాలేదు. ప్రస్తుతం ఓ ఎలక్ట్రిక్ కారును సంస్థ తయారు చేస్తోంది. 2023 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్ పోలో.. ఈ ఈవీఎక్స్ కాన్సెప్ట్ ను ప్రదర్శించింది. తాజాగా ఈ ఈవీకి సంబంధించిన ఓ వార్త లీక్ అయింది. ప్రోటోటైప్ మోడల్‌పై యూరోప్‌లో టెస్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌లోని ఫ్యాక్టరీలో ఈవీలను తయారు చేసి దేశ, విదేశాల్లో విక్రయించాలని మారుతీ సుజుకీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా సంస్థ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ వెహికల్ 'ఈవీఎక్స్ మోడల్' 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Details

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్ల ప్రయాణం

మారుతీ సుజుకీ ఈవీఎక్స్‌లో మస్క్యులర్​ బానెట్​, క్లోజ్​డ్​ ఆఫ్​ గ్రిల్​, ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​, వీ షేప్​ డీఆర్​ఎల్స్​, రేక్​డ్​ విండ్​స్క్రీన్​, వైడ్​ ఎయిర్​ డామ్​, ఇండికేటర్​ మౌంటెడ్​ ఓఆర్​వీఎంలు, డిజైనర్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి. అదే విధంగా వ్రాప్​ అరౌండ్​ టెయిల్​లైట్స్​, రూఫ్​ మౌంటెడ్​ స్పాయిలర్​లు రేర్​లో వస్తున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్, ఏడీఏఎస్ టెక్నాలజీతో పాటు ఇతర ఫీచర్స్ ఉండనున్నాయి. ఈ వెహికల్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. లాంచ్ తర్వాత ఈ మారుతీ సుజుకీ ఎక్స్ షోరూం ధర రూ.18-20 లక్షలు మధ్యలో ఉండొచ్చని మార్కెట్లో అంచనాలున్నాయి.