Page Loader
రికార్డు సృష్టించిన మారుతీ సుజుకీ జిమ్నీ.. 30వేలు దాటిన ఆర్డర్స్
30వేలు దాటిన మారుతీ సుజుకీ జుమ్నీ బుకింగ్స్

రికార్డు సృష్టించిన మారుతీ సుజుకీ జిమ్నీ.. 30వేలు దాటిన ఆర్డర్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 22, 2023
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

మారుతీ సుజుకీ జిమ్మీ లాంచే ముందే రికార్డు సృష్టించింది. ఈ జిమ్మీ 5 డోర్ ఎస్‌యూవీ కోసం ముందు బుక్సింగ్స్ ప్రారంభయమ్యాయి. ఇప్పటికే 30వేల మార్కును అధిగమించి సత్తా చాటింది. జూన్ మొదటి వారంలో మారుతీ సుజుకీ జిమ్మీ భారత్ మార్కెట్లోకి లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. లాంచ్ సమయంలో ధర, పూర్తి వివరాలపై స్పష్టత రానుంది. ధర వెల్లడి కాకముందే బుకింగ్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ కారు బుకింగ్ కోసం రూ.25వేలు టోకెన్ అమౌంట్ చెల్లించి జిమ్మీని బుక్ చేసుకొనే అవకాశం ఉంది. 1.5 లీటర్ నేచురలీ ఆస్పిరేటెడ్ K15B పెట్రోల్ ఇంజిన్ తో ఈ ఎస్‌యూవీ ముందుకొస్తోంది.

Details

ఏడు కలర్లతో రానున్న మారుతీ సుజుకీ జిమ్మీ

6000 rpm వద్ద 103 bhp పీక్ పవర్, 4000 rpm వద్ద 134Nm గరిష్ట టార్క్యూను ఈ ఇంజిన్ జనరేట్ చేయగలదు. మారుతీ సుజుకీ జిమ్మీ 5 డోర్ ఫ్యుయల్ ఎఫిషియెన్సీ ప్రస్తుతం విడుదలైంది. జిమ్మీ ఎంటీ లీటర్ పెట్రోల్ 16.94 కిలోమిటర్ల వరకు ఫ్యుయెల్ ఎఫిషియెన్సీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జిమ్మీ ఏటీ 16.39kmpl వరకు రానున్నట్లు సమాచారం. అయితే 40 లీటర్ల ఫ్యుయెల్ ట్యాంక్ ను ఈ జిమ్మీ 5 డోర్ ఎస్‌యూవీ కలిగి ఉండడం విశేషం. మొత్తంగా ఏడు కలర్లతో మారుతీ సుజుకీ జిమ్మీ 5 డోర్ ఎస్‌యూవీ రానుంది. దీని ధర రూ. 10లక్షల నుంచి రూ.12 లక్షల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది.