Page Loader
కిక్కెక్కించే ఫీచర్లతో నిస్సాన్ మాగ్నైట్ GEZA కారు వచ్చేసింది.. బుకింగ్స్ ఎప్పుడంటే?
నిస్సాన్ మాగ్నైట్ GEZA కారు

కిక్కెక్కించే ఫీచర్లతో నిస్సాన్ మాగ్నైట్ GEZA కారు వచ్చేసింది.. బుకింగ్స్ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2023
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ భారత మార్కెట్లోకి మరో కొత్త కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం నిస్సాన్ భారత మార్కెట్లో మంచి సేల్స్ ను సాధించింది. తాజాగా మాగ్నైట్ GEZA నూతన్ ఎస్‌యూవిని ప్రవేశపెట్టింది. నిస్సాన్ మాగ్నైట్ 2020 డిసెంబర్‌లో ఇండియాలో మొదటి కారును లాంచ్ ను చేసిన విషయం తెలిసిందే. Magnite GEZA స్పెషల్ ఎడిషన్ బుకింగ్‌లు నేడు ప్రారంభమయ్యాయి. రూ. 11వేలతో బుకింగ్స్ చేసుకొనే అవకాశం ఉంది. మే 26న సంస్థ అధికారికంగా ఈ కారును లాంచ్ చేయనుంది. ప్రస్తుతం ఈ మాగ్నైట్ ధర రూ.6 లక్షలు ఉండనుంది.

Details

నిస్సాన్ మాగ్నైట్ జీనా కారులో అధిక ఫీచర్లు

నిస్సాన్ మాగ్నైట్ జీనాలో హై రిజల్యూషన్ 22.86cm టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ కనెక్టివిటీతో ఆండ్రాయిడ్ కార్‌ప్లే, ప్రీమియం JBL స్పీకర్‌లు, ట్రాజెక్టరీ వెనుక కెమెరాతో రానుంది. యాంబియంట్ లైటింగ్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బీజ్ కలర్ సీట్ వంటి ప్రత్యేక ఫీచర్లతో రూపొందించారు. BS6 ఫేజ్ 2కి మారడంతో పాటు, భద్రతా లక్షణాలలో భాగంగా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ తో దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. నిస్సాన్ ఇప్పుడు ట్రాక్షన్‌లో పెరుగుదలను ఆశిస్తోందని, తాము మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్‌ను అత్యుత్తమ సమకాలీన ఫీచర్లతో అందిస్తున్నామని, నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవాస్తవ తెలిపారు.