Page Loader
త్వరలో మార్కెట్లోకి 2024 వోక్స్‌వ్యాగన్ టైగన్
SUV గ్లోబల్-NCAP క్రాష్ టెస్ట్‌లో 5-నక్షత్రాల రేటింగ్‌ను సాధించింది

త్వరలో మార్కెట్లోకి 2024 వోక్స్‌వ్యాగన్ టైగన్

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 25, 2023
06:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత, జర్మన్ మార్క్ వోక్స్‌వ్యాగన్ టైగన్‌ను MY-2024 అప్‌గ్రేడ్‌లతో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. 2021లో లాంచ్ అయిన వోక్స్‌వ్యాగన్ టైగన్ భారతదేశం-నిర్దిష్ట MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ ద్వారా అందించబడిన మొదటి కారు. SUV గ్లోబల్-NCAP క్రాష్ టెస్ట్‌లో 5-నక్షత్రాల రేటింగ్‌ను సాధించింది, ఇది భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. 2024 వోక్స్‌వ్యాగన్ టైగన్ లో మినిమలిస్ట్ డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్, యాంబియంట్ లైటింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఐదు-సీట్ల క్యాబిన్ ఉండచ్చు.

కార్

ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి

ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESC ఉంటాయి. ఇది రెండు టర్బోచార్జ్డ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో వస్తుంది. 2024 టైగన్ సాంకేతిక వివరాలను వోక్స్‌వ్యాగన్ ఇంకా వెల్లడించలేదు.2024 వోక్స్‌వ్యాగన్ టైగన్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ ధర, ఇతర వివరాలను 2023 చివరిలో జరిగే లాంచ్ ఈవెంట్‌లో తయారీసంస్థ ప్రకటిస్తుంది. అప్‌డేట్ అయిన SUV ప్రస్తుత మోడల్ కంటే ఎక్కువ ధర ఉండచ్చు, ఇది భారతదేశంలో రూ. 11.56 లక్షలు నుండి రూ.18.96 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ఉంది.