Audi car: 2025 ఆడీ S5 స్పోర్ట్ కారులో ఊహించని ఫీచర్లు
ఆడీ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా 2025 ఆడి S5 జర్మనీలోని నూర్ బర్గ్ రింగ్ రేసు ట్రాక్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వాహనంలో ప్రొడక్షన్ బాడీ ప్యానెల్‌లు, ఫైనల్ లైట్లను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. దీన్ని ఆకర్షణీయమైన డిజైన్‌తో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది. కొత్త ఆడి S5 స్పోర్ట్‌బ్యాక్‌లో స్లోపింగ్ రూఫ్‌లైన్, పొడవాటి హుడ్, ఏరోడైనమిక్ వీల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, రేక్డ్ విండ్‌స్క్రీన్, ర్యాప్-అరౌండ్ టెయిల్‌ల్యాంప్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంది.
ఆడి S5 లైనప్‌లో స్వల్ప మార్పులు
ఒక ఫ్రీ-స్టాండింగ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లాట్-బాటమ్ మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, బ్లాక్ అప్హోల్స్టరీ, ప్రయాణికుల భద్రత కోసం ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. ఈ వాహనానికి సంబంధించి పవర్‌ట్రైన్ వివరాలు ఇంకా వెల్లడించలేదు. ముఖ్యంగా కొత్త ఆడి S5 లైనప్‌లో కొన్ని మార్పులు చేసినట్లు తెలిసింది. ఆడి S4 సెడాన్‌ను నిలిపివేయవచ్చని రూమర్లు వినిపిస్తున్నాయి.