Page Loader
Audi cars: జనవరి నుంచి భారీగా పెరుగనున్న ఆడీ కార్ల ధరలు.. కారణమిదే! 
జనవరి నుంచి భారీగా పెరుగనున్న ఆడీ కార్ల ధరలు.. కారణమిదే!

Audi cars: జనవరి నుంచి భారీగా పెరుగనున్న ఆడీ కార్ల ధరలు.. కారణమిదే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2023
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీకి చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ ఆడీ ఇండియా (Audi India) కార్ల ధరలను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి నుంచి తమ వాహనాల ధరలను రెండు శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. 2024 జనవరి 1 నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ఆడీ సంస్థ స్పష్టం చేసింది. నిర్వహణ వ్యయాలు పెరగడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. సంస్థతో పాటు డీలర్ల మనుగడ కోసం ధరల పెంపు తప్పలేదని ఆడీ ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాన్ (Balbir Singh Dhillon) స్పష్టం చేశారు.

Details

ధర ప్రభావం కస్టమర్లపై తక్కువ ఉండేలా చూస్తామన్న బల్బీర్ సింగ్ ధిల్లాన్

ఈ ధరల పెంపు ప్రభావం కస్టమర్లపై వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తామని బల్బీర్ సింద్ ధిల్లాన్ పేర్కొన్నారు. ఇక భారత్‌లో క్యూ 3 ఎస్‌యూవీ నుంచి ఆర్ఎస్‌క్యూ8 వరకు ఆడీ పలు రకాల కార్లను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ధరల శ్రేణి రూ.42.77 లక్షల నుంచి రూ.2.22 కోట్ల మధ్య ఉండనుంది. ఆడీ కార్ల ధరల పెరుగుదలతో కస్టమర్లకు మరోసారి షాక్ తగిలింది.