
Kawasaki Versys 650:ఇండియాలో లాంచ్ అయ్యిన కవాసకి వెర్సిస్ 2025 మోడల్.. దీని ధర ఎంతంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) భారత్‌లో తన కొత్త అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్ వెర్సిస్ 650 (Versys 650) 2025 మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది.
ఈ బైక్‌కి కంపెనీ నిర్ణయించిన ధర రూ.7.93 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఈ మోడల్‌ను కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం OBD-2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు.
ఇంతకుముందు విడుదలైన 2024 మోడల్‌తో పోలిస్తే కొత్త మోడల్ ధరలో రూ.16 వేలు అధికం. ప్రస్తుతం పాత వెర్షన్‌పై రూ.30 వేల వరకూ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.
వివరాలు
బైక్ స్పెసిఫికేషన్లు:
కవాసకి వెర్సిస్ 650 బైక్ డిజైన్ విషయంలో కొత్త రంగులు తప్పించి ఎలాంటి ముఖ్యమైన మార్పులు చేయలేదు.
ఈ మోటార్‌సైకిల్‌లో 649 సీసీ లిక్విడ్ కూల్డ్,ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అమర్చారు.
ఇది 8500 ఆర్‌పీఎం వద్ద 66 హెచ్‌పీ పవర్ను,7000 ఆర్‌పీఎం వద్ద 61 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్ను అందించారు. బైక్ బరువు 218 కిలోలుగా ఉంది.
ముందుభాగంలో 300 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుకభాగంలో 250 ఎంఎం డిస్క్ బ్రేక్ ఉన్నాయి.
ఇంధన ట్యాంక్ సామర్థ్యం 21 లీటర్లు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మోడల్ ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 660 బైక్‌కి గట్టిపోటీగా నిలుస్తోంది.
అయితే, ట్రయంఫ్ బైక్ ధర రూ.9.45 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది.