2025 MG Comet: ఎంజీ కామెట్ ఈవీ 2025 ఎడిషన్ లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 2025 ఎడిషన్ కామెట్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కాంపాక్ట్ ఈవీ కారును రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకొచ్చింది.
బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ (BaaS) మోడల్‌లో ఇది లభించనుంది. అంటే వినియోగదారులు బ్యాటరీకి కిలోమీటర్‌కు రూ.2.5 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కామెట్ ఈవీ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది
ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్సైట్ ఫాస్ట్ ఛార్జ్, ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ ఫాస్ట్ ఛార్జింగ్. ఎక్సైట్, ఎక్సైట్ ఎఫ్‌సీ వేరియంట్లలో కొత్తగా పార్కింగ్ కెమెరా, పవర్-ఫోల్డింగ్ ఓఆర్‌ఎంలను కలిపారు.
Details
సింగిల్ ఛార్జ్ తో 230 కిలోమీటర్లు
ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్లలో లెథర్ సీట్లు, 4-స్పీకర్ ఆడియో సిస్టమ్‌ను చేర్చారు.
ఎఫ్‌సీ వేరియంట్లు 17.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి, వీటి సింగిల్ ఛార్జ్ పరిధి 230 కిలోమీటర్లు.
భద్రత పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, రేర్ పార్కింగ్ సెన్సర్, స్పీడ్-సెన్సింగ్ ఆటో డోర్ లాక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హోమ్ హెడ్‌ల్యాంప్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు.