
Renault Kiger Facelift: 2025 రెనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. కొత్త ఫీచర్లు, వేరియంట్ల ధరల ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
రెనాల్ట్ సంస్థ 2025 కైగర్ ఫేస్‌లిఫ్ట్‌ను అధికారికంగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కొత్త మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.29 లక్షలుగా ఉంది. టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే మోడళ్ల ధరలు రూ. 9.99 లక్షల నుంచి మొదలవుతాయి. పాత కైగర్‌తో పోలిస్తే, టాప్-ట్రిమ్ ధరలో సుమారు రూ. 6,000 పెరిగింది. ప్రధాన ప్రత్యర్థి నిస్సాన్ మాగ్నైట్‌తో పోలిస్తే, కైగర్ బేస్ వేరియంట్ రూ. 15,000 తక్కువ ధరలో లభిస్తోంది.
Details
వేరియంట్లు - ధరల వ్యూహం
కొత్త కైగర్ వేరియంట్ లైనప్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆథెంటిక్ ట్రిమ్ - రూ. 6.29 లక్షలు ఎవల్యూషన్ ట్రిమ్ - రూ. 7.09 లక్షలు టెక్నో, ఎమోషన్ ట్రిమ్‌లు (నాన్-టర్బో పెట్రోల్) - వరుసగా రూ. 8.9 లక్షలు, రూ. 9.14 లక్షలు టెక్నో ట్రిమ్ (టర్బో + సీవీటీ గేర్‌బాక్స్) - రూ. 9.99 లక్షలు ఎమోషన్ ట్రిమ్ (టర్బో పెట్రోల్) - రూ. 9.99 లక్షలు నుంచి రూ. 11.29 లక్షలు ఈ ధరలు ఎక్స్-షోరూమ్ రేట్లు మాత్రమే. పండుగ సీజన్ సందర్భంగా ఇవి ఇంట్రొడక్టరీ ఆఫర్లుగా ప్రకటించారు
Details
డిజైన్‌లో మార్పులు
ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో సాధారణంగా ఉండే చిన్నపాటి మార్పులను రెనాల్ట్ కైగర్ పొందింది. కొత్త బంపర్ డిజైన్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్ పాత మాదిరిగానే డీఆర్‌ఎల్‌లు సైడ్ ప్రొఫైల్‌లో కొత్త 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్ కొత్త "ఓయాసిస్ యెల్లో" కలర్ ఆప్షన్ వెనుక భాగంలో మాత్రం పెద్దగా మార్పులు లేవు.
Details
ఫీచర్లు, క్యాబిన్ అప్డేట్స్
కైగర్ లోపలి భాగం గణనీయంగా రీడిజైన్ అయింది. కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్) కొత్త క్యాబిన్ థీమ్‌లు - నాయిర్, కూల్ గ్రే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు (నిస్సాన్ మాగ్నైట్‌లో లేని ఫీచర్) మల్టీవ్యూ కెమెరా, ఆటో హెడ్‌ల్యాంప్స్, ఆటో వైపర్స్ స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్స్ మొత్తం 21 సేఫ్టీ ఫీచర్లు (హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సహా)
Details
ఇంజిన్ ఆప్షన్లు
ఇంజిన్ ఎంపికలో మార్పులు లేవు. పాత మోడల్‌లో ఉన్నవే కొనసాగుతున్నాయి. 1.0 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ - 71 bhp పవర్, 96 Nm టార్క్. (5-స్పీడ్ మాన్యువల్/AMT) 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ - 98 bhp పవర్, 160 Nm టార్క్. (5-స్పీడ్ మాన్యువల్/సీవీటీ) సీఎన్జీ ఆప్షన్ - నాన్-టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో లభ్యం మొత్తంగా, 2025 రెనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్ చిన్న మార్పులతో, కొత్త ఫీచర్లతో, బడ్జెట్-ఫ్రెండ్లీ ధరలతో మార్కెట్లోకి వచ్చింది. నిస్సాన్ మాగ్నైట్‌కి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.