Skoda Octavia AWD: అత్యాధునిక టెక్నాలజీ, శక్తివంతమైన ఇంజిన్‌తో 2025 స్కోడా ఆక్టావియా AWD
ఈ వార్తాకథనం ఏంటి
2025 స్కోడా ఆక్టావియా AWD గ్లోబల్ మార్కెట్‌లో అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో రానుంది.
ఈ తాజా మోడల్ అత్యాధునిక సాంకేతికత, శక్తివంతమైన ఇంజిన్, మెరుగైన పనితీరుతో రానుంది.
ఈ కారు 2.0-లీటర్ TSI టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది.
ఇది గరిష్టంగా 201 bhp పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. గత మోడల్‌తో పోల్చితే 14 bhp అధిక శక్తిని అందించే ఈ ఇంజిన్, ఆక్టావియాను మరింత శక్తివంతమైన కారుగా తీర్చిదిద్దుతోంది.
Details
ఆక్టావియా AWD వేగం, పనితీరు
2025 స్కోడా ఆక్టావియా AWD 0-100 kmph వేగాన్ని కేవలం 6.6 సెకన్లలో చేరుకోగలదు. ఇక ఎస్టేట్ వెర్షన్ 6.7 సెకన్లలో ఈ లక్ష్యాన్ని చేరుకోనుంది.
గరిష్ఠంగా 228 kmph టాప్ స్పీడ్‌ను అందుకోగల ఈ మోడల్‌లో AWD (ఆల్ వీల్ డ్రైవ్) సిస్టమ్‌ను స్కోడా ప్రవేశపెట్టింది.
ఈ AWD వ్యవస్థ ఎలక్ట్రోహైడ్రాలిక్ కంట్రోల్డ్ మల్టీ-ప్లేట్ క్లచ్ ద్వారా పని చేస్తుంది. డ్రైవింగ్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించే సెన్సార్ల సహాయంతో టార్క్ పంపిణీ మరింత సమర్థవంతంగా జరుగుతుంది.
EDS, XDS ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఇందులో భాగమయ్యాయి.
ఇవి టార్క్ ట్రాన్స్‌ఫర్ సామర్థ్యాన్ని పెంచి, డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా, ఈ AWD వ్యవస్థ వాహన టవింగ్ సామర్థ్యాన్ని 1,900 kg వరకు పెంచింది.
Details
భారత మార్కెట్లో మార్పులు
2025 ఆక్టావియా AWD మోడల్ విడుదలకు ముందు భారత మార్కెట్‌లో స్కోడా కొడియాక్‌ను కంపెనీ వెబ్‌సైట్ నుండి తొలగించింది.
గతంలో స్కోడా కొడియాక్ L&K వేరియంట్ రూ. 40.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు లభించేది.
ఇందులో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉండేది. ఇది 187 bhp పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగిఉంది.
Details
రాబోయే ఆక్టావియా AWD పై ఆసక్తి
ఇదివరకు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో స్కోడా ఆక్టావియా AWDను ప్రదర్శించారు.
ఇప్పుడు కొత్త మోడల్ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో భారత మార్కెట్లో దీని ప్రభావం ఎలా ఉండనుందో ఆసక్తిగా మారింది.
స్కోడా తన కొత్త మోడళ్లతో ఆటోమొబైల్ మార్కెట్లో మరిన్ని మార్పులు తీసుకొస్తున్నట్లు స్పష్టమవుతోంది.