LOADING...
Yezdi Roadster: 2025 యెజ్డీ రోడ్‌స్టర్ విడుదల.. కొత్త కలర్స్, అప్‌డేట్స్‌తో మరింత ప్రీమియం లుక్
2025 యెజ్డీ రోడ్‌స్టర్ విడుదల.. కొత్త కలర్స్, అప్‌డేట్స్‌తో మరింత ప్రీమియం లుక్

Yezdi Roadster: 2025 యెజ్డీ రోడ్‌స్టర్ విడుదల.. కొత్త కలర్స్, అప్‌డేట్స్‌తో మరింత ప్రీమియం లుక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 13, 2025
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

2025 యెజ్డీ రోడ్‌స్టర్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.10 లక్షలు. కొత్త మోడల్‌లో అనేక అప్‌డేట్లు, కొత్త కలర్ స్కీమ్‌లు జోడించడంతో ఇది మరింత ప్రీమియంగా కనిపిస్తోంది. బైక్‌లోని ముఖ్య విశేషాలు ఇలా ఉన్నాయి.

Details

డిజైన్ 

రెట్రో స్టైలింగ్‌కి ఆధునిక టచ్‌ జోడించి యెజ్డీ రోడ్‌స్టర్ డిజైన్ రూపొందించారు. గుండ్రని ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టియర్‌డ్రాప్ ఆకార ఫ్యూయల్ ట్యాంక్, కర్వ్‌డ్ ఫెండర్లు, పలుచని టెయిల్‌ల్యాంప్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బైక్ ప్రత్యేకతను పెంచేందుకు ఇంటిగ్రేటెడ్ టెయిల్‌లైట్స్, టర్న్ ఇండికేటర్లు, డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్, హైడ్రోఫార్మింగ్ హ్యాండిల్‌బార్లు, రిమూవబుల్ పిలియన్ సీట్లు వంటి ఫీచర్లతో కూడిన 6 ఫ్యాక్టరీ కస్టమ్ కిట్ల ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. బలమైన స్టీల్ ఫ్రేమ్‌తో పాటు ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి.

Details

ఇంజిన్ & పనితీరు

ట్యూబ్‌లెస్ టైర్లకు అల్లాయ్ వీల్స్‌ను అందించారు. భద్రత కోసం ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. 334 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ 28.6 బీహెచ్‌పీ శక్తి, 30 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేసి, అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీని పొందుపరిచారు.

Details

వారంటీ & డెలివరీ

కంపెనీ 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అందిస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, త్వరలోనే డెలివరీలు కూడా మొదలుకానున్నాయి. రెట్రో లుక్, మోడ్రన్ ఫీచర్ల సమ్మేళనాన్ని కోరుకునే బైక్ ప్రేమికులకు 2025 యెజ్డీ రోడ్‌స్టర్ సరైన ఎంపికగా నిలుస్తుంది.