LOADING...
Renault Duster : 2026 డస్టర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొనడానికి విలువైనదేనా?
2026 డస్టర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొనడానికి విలువైనదేనా?

Renault Duster : 2026 డస్టర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొనడానికి విలువైనదేనా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2026
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం రోజురోజుకూ విస్తరిస్తూ, పోటీ మరింత తీవ్రంగా మారుతోంది. మారుతీ సుజుకీ, గ్రాండ్ విటారా, విక్టోరిస్, హోండా ఎలివేట్, ఎంజీ మోటర్ ఆస్టర్, వోక్స్‌వ్యాగన్ టైగున్, స్కోడా కుషాక్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, టాటా మోటర్స్ సియెర్రా, మహీంధ్రా థార్ రాక్స్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లతో ఈ సెగ్మెంట్ కట్-త్రోట్ పోటీని ఎదుర్కొంటోంది. ఈ తీవ్ర పోటీలో రెనాల్ట్ తన లెజెండరీ బ్రాండ్ 'డస్టర్'ను మళ్లీ రంగంలోకి తీసుకువచ్చింది. రూ.10.49లక్షల(ఎక్స్‌-షోరూమ్)ప్రారంభ ధరతో వచ్చిన కొత్త 2026 రెనాల్ట్ డస్టర్, పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే ఆధునిక స్టైలింగ్, ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఇది కంపెనీకి ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలుస్తోంది.

వివరాలు

ఎక్స్‌టీరియర్ డిజైన్

డస్టర్ ఎక్స్‌టీరియర్ విషయంలో రెనాల్ట్ చక్కటి డిజైన్ నిర్ణయాలు తీసుకుంది. రోడ్డుపై వెళ్తుంటే ఇది వెంటనే దృష్టిని ఆకర్షించేలా ఉంటుంది. హెచ్‌టీ ఆటో టీమ్ డెహ్రాడూన్ నుంచి తెహ్రీ లేక్ వరకు డ్రైవ్ చేసినప్పుడు, ఈ కారును గమనించని వారు లేరని చెబుతున్నారు. కారులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్‌ఎల్స్, ఫాగ్ ల్యాంప్స్ ప్రధాన ఆకర్షణలు. భారీ ఫ్రంట్ బంపర్, ఫంక్షనల్ ఎయిర్ డ్యామ్స్, సిల్వర్ క్లాడింగ్ దీని లుక్‌కు ప్రత్యేక ఆకర్షణను తెస్తాయి. ముందు భాగంలో రెనాల్ట్ లోగో స్థానంలో 'డస్టర్' బ్యాడ్జింగ్ ఉండటం ప్రత్యేకత. అలాగే 360-డిగ్రీ కెమెరాలో భాగంగా ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ క్లాడింగ్, రూఫ్ రైల్స్‌తో ఇది పక్కా ఎస్‌యూవీ ఫీల్ ఇస్తుంది.

వివరాలు

నాలుగు పార్కింగ్ సెన్సార్లు

ఈ రైల్స్ 50 కిలోల బరువును మోయగలవు. 212 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉండగా, ఇది ఈ సెగ్మెంట్‌లో అగ్రగామిగా నిలుస్తోంది (హోండా ఎలివేట్ తర్వాత). వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, రియర్ వైపర్, డిఫాగర్, రివర్స్ కెమెరా, నాలుగు పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. పవర్డ్ టెయిల్‌గేట్ కూడా అందించారు. బూట్ స్పేస్ 518 లీటర్లు కాగా, పార్సెల్ ట్రే తొలగిస్తే 700 లీటర్లకు పైగా పెంచుకోవచ్చు.

Advertisement

వివరాలు

ఇంటీరియర్ & ఫీచర్లు

ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఇంటీరియర్లలో డస్టర్ ఒకటిగా చెప్పవచ్చు. కార్బన్ ఫైబర్ ఫినిష్ డ్యాష్‌బోర్డ్, లెదర్ టచ్‌తో క్యాబిన్ ప్రీమియంగా కనిపిస్తుంది. ప్రధాన ఫీచర్లు: 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ & కో-ప్యాసింజర్ సీట్లు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ 10.1-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ (గూగుల్ మ్యాప్స్‌తో) 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ USB-C పోర్ట్స్, 12V సాకెట్ సీట్లు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ కొంచెం గట్టిగా ఉంటాయి. వెనుక సీట్లలో కూడా సరిపడా స్థలం, ఏసీ వెంట్స్, యూఎస్బీ పోర్ట్స్, ఆర్మ్‌రెస్ట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

Advertisement

వివరాలు

ఇంజిన్ ఆప్షన్లు

2026 డస్టర్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది TCE 100 : 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 98 bhp పవర్, 166 Nm టార్క్, 6-స్పీడ్ మాన్యువల్ TCE 160 : 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 160 bhp పవర్, 280 Nm టార్క్, 6-స్పీడ్ మాన్యువల్ & DCT ఆప్షన్ డ్రైవింగ్ అనుభవం డస్టర్ డ్రైవింగ్ అనుభవం పాత తరం మాదిరిగానే ఆకట్టుకుంటుంది. ఇరుకైన రోడ్లు, హెయిర్‌పిన్ బెండ్లలో కూడా ఇది మంచి స్థిరత్వాన్ని చూపింది. స్టీరింగ్ స్పందన ఖచ్చితంగా ఉండగా, బాడీ రోల్ తక్కువగా ఉంది. సస్పెన్షన్ కొంచెం గట్టిగా ఉన్నప్పటికీ, కొండ ప్రాంతాల్లో ఇది స్పష్టంగా అనిపిస్తుంది.

వివరాలు

రూ.10.49 లక్షలతో ప్రారంభ ధర

అయితే బ్రేకింగ్ వ్యవస్థ మరింత మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉందని టీమ్ అభిప్రాయపడింది. ముఖ్యంగా దిగువ దారుల్లో బ్రేకులు పూర్తి నమ్మకాన్ని ఇవ్వకపోవడంతో ఇంజిన్ బ్రేకింగ్‌పై ఆధారపడాల్సి వచ్చింది. 1.3 లీటర్ ఇంజిన్ టర్బో శబ్దం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మొత్తం మీద, కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కొనాలనుకునే వారికి రెనాల్ట్ డస్టర్ ఒక పూర్తి ప్యాకేజీగా నిలుస్తుంది. లుక్స్, పనితీరు, డ్రైవింగ్ అనుభవం— అల్ రౌండర్‌గా ఈ కారు గట్టి పోటీ ఇస్తోంది. రూ.10.49 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్‌లో మంచి స్థానం సంపాదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెనాల్ట్‌కు మళ్లీ ఒక సక్సెస్‌ఫుల్ మోడల్ దొరికిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement