2027 Honda Africa Twin: హోండా ఆఫ్రికా ట్విన్ 2027 వచ్చేసింది.. మూడు వేరియంట్లలో ఏది బెస్ట్?
ఈ వార్తాకథనం ఏంటి
హోండా 2027 CRF1150L ఆఫ్రికా ట్విన్‌ను మూడు విభిన్న వేరియంట్లలో తీసుకొచ్చింది. Standard, Adventure Sports, Enduro Sports పేర్లతో వచ్చిన ఈ మూడు మోడళ్లలో ఇంజిన్ ఒకటే అయినా.. రైడింగ్ అవసరాలకు తగ్గట్టుగా సస్పెన్షన్, వీల్స్, ఫ్యూయల్ ట్యాంక్, ఎలక్ట్రానిక్స్‌లో తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త Enduro Sports ఆఫ్‌రోడ్ ప్రియులను టార్గెట్ చేస్తోంది. మూడు వేరియంట్లలోనూ 1,131cc లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 117 hp పవర్, 119 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
Details
117 hp పవర్‌తో కొత్త ఇంజిన్
పాత 1,084cc ఇంజిన్‌తో పోలిస్తే కొత్త యూనిట్ సామర్థ్యం పెరిగింది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్‌తో పాటు హోండా DCT గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది.
కొత్త స్టీల్ ఫ్రేమ్, అల్యూమినియం స్వింగార్మ్, సీటు కింద కొంత భాగంలో ఏర్పాటు చేసిన ఫ్యూయల్ సబ్‌ట్యాంక్ ద్వారా బరువును సమతుల్యం చేశారు.
7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్, 5.7-అంగుళాల సెకండరీ డిస్‌ప్లే, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto వంటి ఫీచర్లు మూడు వేరియంట్లలోనూ ఉన్నాయి.
Details
Standard.. అన్నింటికీ బ్యాలెన్స్‌డ్ ఛాయిస్
Standard వేరియంట్ రోజువారీ రైడింగ్, టూరింగ్, కొంత ఆఫ్‌రోడ్ వినియోగానికి సరిపోయేలా రూపొందించారు.
ఇందులో 21-అంగుళాల ముందు, 18-అంగుళాల వెనుక స్పోక్ వీల్స్, 18.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటాయి. Showa ఎలక్ట్రానిక్ సస్పెన్షన్‌లో ముందు 220mm, వెనుక 210mm ట్రావెల్ ఉంటుంది.
సీట్ హైట్ 850-870mm మధ్య ఉంటుంది. మాన్యువల్ వెర్షన్ బరువు 237kg కాగా, DCT వెర్షన్ 247kg. ఆటో మొబైల్ రంగంలో బరువైన వాహనాలకు మంచి క్రేజ్ ఉండటం విశేషం
Details
Adventure Sports.. లాంగ్ రైడ్‌లకు
ఎక్కువ దూరం ప్రయాణించే వారికి Adventure Sports ఆకట్టుకునేలా ఉంది. ఇందులో 24.2 లీటర్ల ట్యాంక్, 19-అంగుళాల ఫ్రంట్ వీల్, 110-సెక్షన్ ఫ్రంట్ టైర్ ఉన్నాయి.
సీట్ హైట్ 830-850mm మాత్రమే ఉండటంతో మూడు వేరియంట్లలో ఇదే తక్కువ ఎత్తు కలిగిన మోడల్. మాన్యువల్ బరువు 245kg కాగా DCT 255kg. DCTతో పాటు Honda Sensing Ride తీసుకుంటే అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ వంటి రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు లభిస్తాయి.
Details
Enduro Sports.. అసలైన ఆఫ్‌రోడ్ మెషీన్
మూడు వేరియంట్లలో ఎక్కువ ఆసక్తి రేపుతున్నది కొత్త Enduro Sports. Honda CRF450 RALLY నుంచి స్ఫూర్తి పొందిన డిజైన్‌తో వచ్చిన ఈ మోడల్ ఆఫ్‌రోడ్ రైడింగ్‌ను దృష్టిలో పెట్టుకుంది.
ఇందులో 49mm USD Showa ఫ్రంట్ ఫోర్క్ 240mm ట్రావెల్, వెనుక మోనోషాక్ 230mm ట్రావెల్‌తో వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 260mmకి పెరిగింది. సీట్ హైట్ 870-890mm ఉంటుంది. మాన్యువల్ వెర్షన్ కేవలం 228kg, DCT 239kg బరువుతో ఉండటం దీని ప్రత్యేకత.
21/18 వీల్స్, 18.8 లీటర్ల ట్యాంక్ కొనసాగినా.. రాడార్ ఆధారిత రైడర్ ఎయిడ్స్, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ ఇందులో ఉండవు.