Loading...
Volkswagen: 2027 ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ రాబిట్ ఎడిషన్.. అదిరిపోయే లుక్‌తో కొత్త కారు!
2027 ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ రాబిట్ ఎడిషన్.. అదిరిపోయే లుక్‌తో కొత్త కారు!

Volkswagen: 2027 ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ రాబిట్ ఎడిషన్.. అదిరిపోయే లుక్‌తో కొత్త కారు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2026
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీకి చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen), 2027 గోల్ఫ్ జీటీఐ (Golf GTI) లైనప్‌లో భాగంగా పరిమిత సంఖ్యలో రాబిట్ ఎడిషన్‌ను (Rabbit Edition) ఆవిష్కరించింది. ధర, ఫీచర్ల పరంగా ఈ ప్రత్యేక ఎడిషన్ ఎస్ (S), ఎస్ఈ (SE) వేరియంట్ల మధ్యలో ఉండనుంది. ఇందులో డీసీసీ అడాప్టివ్ డ్యాంపర్లు, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, సమ్మర్ టైర్లతో పాటు పలు పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. 2027 రెండో త్రైమాసికంలో విడుదల కానున్న ఈ మోడల్ అమెరికా మార్కెట్‌కు మాత్రమే పరిమితం కానుంది.

వివరాలు

ఒరిజినల్ Mk 1 రాబిట్‌కు నివాళి

అమెరికాలో హాట్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌కు పరిచయం చేసిన ఒరిజినల్ Mk 1 ఫోక్స్‌వ్యాగన్ రాబిట్ మోడల్‌కు గుర్తుగా ఈ కొత్త ఎడిషన్‌ను రూపొందించారు.

గోల్ఫ్ జీటీఐ లైనప్‌లో మిడ్‌ఇయర్ అప్‌డేట్‌గా ఇది మార్కెట్లోకి రానుంది.

సాధారణంగా ఆటోబాన్ (Autobahn) వంటి టాప్ వేరియంట్లలో లభించే కొన్ని పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్స్‌ను ఇందులో అందించారు.

వివరాలు

ప్రత్యేకమైన డార్క్ మాస్ గ్రీన్ మెటాలిక్ కలర్

రాబిట్ ఎడిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా డార్క్ మాస్ గ్రీన్ మెటాలిక్ (Dark Moss Green Metallic) రంగును అందించారు.

యూరప్‌లోని గోల్ఫ్ జీటీఐ ఎడిషన్ 50 మోడల్ నుంచి ఈ రంగును తీసుకున్నారు. దీనికి పూర్తిగా బ్లాక్ థీమ్‌ను జోడించారు.

బ్లాక్ గ్రిల్, హెడ్‌లైట్లు (సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాయి), వీల్స్, మిర్రర్ క్యాప్స్, రూఫ్‌తో కారుకు ప్రత్యేక రూపాన్ని ఇచ్చారు.

వెనుక భాగంలోని రాబిట్ బ్యాడ్జ్ మాత్రమే క్రోమ్ ఫినిషింగ్‌తో ఉంటుంది. ఇది ఒరిజినల్ మోడల్‌కు నివాళిగా ఏర్పాటు చేశారు.

కారు లోపలి భాగంలో గోల్ఫ్ జీటీఐ క్లబ్‌స్పోర్ట్ (Golf GTI Clubsport) స్ఫూర్తితో రూపొందించిన అప్‌హోల్స్టరీని అందించారు. దీంతో క్యాబిన్‌కు మరింత ప్రీమియం లుక్ లభిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు

241 హెచ్‌పీ టర్బో పెట్రోల్ ఇంజిన్

రాబిట్ ఎడిషన్‌లో అమెరికా మార్కెట్‌లోని సాధారణ గోల్ఫ్ జీటీఐ మాదిరిగానే 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ నాలుగు సిలిండర్ల ఇంజిన్‌ను ఉపయోగించారు.

ఇది 241 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఏడు స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

ఈ ప్రత్యేక ఎడిషన్‌లో అదనపు పవర్‌ను అందిస్తున్నట్లు ఫోక్స్‌వ్యాగన్ వెల్లడించలేదు. అయితే, ప్రత్యేకమైన డిజైన్‌తో పాటు అధిక శ్రేణి వేరియంట్లలో ఉండే అప్‌గ్రేడ్ చేసిన ఛాసిస్ పరికరాలు దీనికి ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఈవీల (EVs) వైపు మారుతున్న క్రమంలో భాగంగా 2027 నుంచి పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే గోల్ఫ్ కార్ల ఉత్పత్తిని మెక్సికోలోని ప్యూబ్లా (Puebla) ప్లాంట్‌కు తరలించాలని ఫోక్స్‌వ్యాగన్ నిర్ణయించింది.

ADVERTISEMENT

వివరాలు

ధర, విడుదల వివరాలు

రాబిట్ ఎడిషన్ 2027 రెండో త్రైమాసికంలో అమెరికా మార్కెట్లో విక్రయానికి రానుంది. అయితే, ఫోక్స్‌వ్యాగన్ ఇప్పటివరకు అధికారిక ధరను ప్రకటించలేదు.

ప్రాథమిక మోడల్ ధర 36,230 డాలర్లు కాగా, అధిక వేరియంట్ ధర 40,420 డాలర్లు. ఈ రెండు ధరల మధ్యలో రాబిట్ ఎడిషన్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

అధికారిక విడుదలకు ముందే ఈ ప్రత్యేక ఎడిషన్‌ను 2026 లాస్ ఏంజెలెస్ ఆటో షోలో సందర్శకులు వీక్షించవచ్చు. నవంబర్ 29 వరకు ఈ ఆటో షోలో కారు అందుబాటులో ఉంటుంది.

ADVERTISEMENT