LOADING...
S1 Pro Sport: ఒక్క ఛార్జ్‌తో 320 కి.మీ.. ఏడీఏఎస్ ఫీచర్లతో ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్ లాంచ్! 
ఒక్క ఛార్జ్‌తో 320 కి.మీ.. ఏడీఏఎస్ ఫీచర్లతో ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్ లాంచ్!

S1 Pro Sport: ఒక్క ఛార్జ్‌తో 320 కి.మీ.. ఏడీఏఎస్ ఫీచర్లతో ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్ లాంచ్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2025
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1 ప్రో స్పోర్ట్‌ను ఆగస్టు 15 సాయంత్రం తమిళనాడులోని ప్లాంట్‌లో జరిగిన సంకల్ప్ కార్యక్రమంలో అధికారికంగా ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్‌కు కంపెనీ రూ. 1,49,999(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరగా నిర్ణయించింది. కేవలం రూ.999 చెల్లించి బుకింగ్ ప్రారంభించవచ్చు. డెలివరీలు 2026 జనవరి నుంచి మొదలవుతాయని కంపెనీ తెలిపింది. స్పోర్ట్-ఫోకస్డ్ వేరియంట్ ఎస్ 1 లైనప్‌లో ఇది స్పోర్ట్-ఫోకస్డ్ వేరియంట్. దీనికోసం ఓలా స్వయంగా అభివృద్ధి చేసిన 13 కిలోవాట్ల ఫెర్రైట్ మోటార్‌ను ఉపయోగించింది. కొత్త స్టైలింగ్, స్పోర్ట్ ట్యూన్ చేసిన సస్పెన్షన్, అలాగే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్(ADAS)ఈ స్కూటర్ ప్రత్యేకతలు. భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌లోADASటెక్నాలజీని ఉపయోగించడం ఇదే మొదటిసారి.

Details

డిజైన్ & ఫీచర్లు

ఎస్ 1 ప్రో స్పోర్ట్ డిజైన్‌లో ఏరోడైనమిక్ ఆప్టిమైజ్డ్ బాడీవర్క్, చిన్న విండ్స్‌క్రీన్, కార్బన్ ఫైబర్ ఫ్రంట్ ఫెండర్, గ్రాబ్ రైల్స్ ఉన్నాయి. రైడర్‌కు మరింత సౌకర్యం కలిగించేందుకు సవరించిన ఫోమ్‌తో కొత్త సీటు అమర్చారు. మొత్తం లైటింగ్ సెటప్ ఫుల్ LEDగా ఉండగా, మెరుగైన విజిబిలిటీ కోసం కొత్త డే టైమ్ రన్నింగ్ లైట్ (DRL) ఇచ్చారు. పనితీరు & రేంజ్ ఈ స్కూటర్‌లోని ఫెర్రైట్ మాగ్నెట్ మోటార్ గరిష్టంగా 16 కిలోవాట్ల పవర్, 71 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4680 సెల్‌తో కూడిన 5.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ జత చేశారు.

Details

2 సెకన్లలో 40 కిమీ వేగం

గరిష్ట వేగం: గంటకు 152 కిమీ 0-40 కిమీ వేగం: 2 సెకన్లలో రేంజ్: 320 కిమీ సస్పెన్షన్ సెటప్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, ప్రీలోడ్-అడ్జస్టబుల్ రియర్ మోనోషాక్ ఉన్నాయి. రెండు చక్రాలకీ డిస్క్ బ్రేకులు అమర్చారు. ముందు భాగంలో 14 అంగుళాల అల్లాయ్ వీల్ (వైడ్ టైర్లతో) ఇచ్చారు. అదనంగా 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, 791 మిమీ సీటు ఎత్తు అందించారు.