టెస్లాను ఆకర్షించడానికి ఈవీలపై దిగుమతి సుంకాలు తగ్గించే ఛాన్స్
ఎలక్ట్రిక్ వాహనాల (EV)లపై దిగుమతి సుంకాలను 15శాతం తగ్గించాలనే టెస్లా ప్రతిపాదనలకు భారత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. దీంతో టెస్లా ఇండియాలో బిజెనెస్ మొదలు పెట్టేందుకు సహకారం లభిస్తుందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. టెస్లా భారతదేశంలో ఉత్పాదక సదుపాయాన్ని స్థాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టెస్లా జర్మన్ ప్లాంట్‌లో ఇంకా అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారును ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు పలు నివేదికలు వచ్చాయి. టెస్లా $40,000 కంటే తక్కువ విలువైన (CBU) కార్లను దిగుమతి చేసుకునేందుకు 70శాతం $40,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన కార్లపై 100శాతం సుంకాన్ని తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.
త్వరలో ఎలాన్ మస్క్ ను కలవనున్న వాణిజ్య మంత్రి
ఇండియాలో టెస్లా ఒక ప్లాంట్‌ను నిర్మించడానికి కొన్ని టారిఫ్‌లు, రాయితీలు కూడా అవసరమని, ఇందులో టెస్లా వైఖరి స్థిరంగా ఉందని ఓ ప్రభుత్వ అధికారి పేర్కొన్నాడు. మొదట్లో టెస్లాకు ప్రత్యేకమైన రాయితీలను మంజూరు చేసే ఆలోచన లేదని భారత ప్రభుత్వం పేర్కొంది. అయితే దిగుమతి సుంకాలను తగ్గిస్తే టెస్లా మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకునే ఇతర వాహన తయారీదారులకు కూడా ప్రయోజనం చేకూరుతాయని భావించింది. ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పెరిటీకి సంబంధించిన సమావేశాల్లో పాల్గొనేందుకు భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ రాబోయే వారంలో శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో గోయల్ ఎలాన్ మస్క్‌ను కలిసే అవకాశాన్ని భారత అధికారి ఒకరు ప్రస్తావించారు.