లెక్ట్రిక్స్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఎస్ఏఆర్ గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ లెక్ట్రిక్స్ ఈవీ కొత్తగా రెండు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచచింది.
ఎల్‌ఎక్స్‌ఎస్ జీ3.0, ఎల్‌ఎక్స్‌ఎస్ జీ2.0 ట్రిమ్స్ పేరుతో ఈ స్కూటర్లను లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధర రూ.1.03 లక్షలు ఉండనుంది.
2.3 కిలోవాట్స్, 3 కిలోవాట్స్ బ్యాటరీ సామర్థ్యంతో ఈ స్కూటర్లు వచ్చాయి. వీటిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల ప్రయాణించగలవని కంపెనీ ఎండీ, సీఈఓ కె.విజయ్ కుమార్ వెల్లడించారు.
వచ్చే నెల 16 నుంచి ఈ స్కూటర్ల డెలవరీలు మొదలు కానున్నాయి. మొత్తంగా 12 రకాల ఫీచర్లను కలుపుకొని మొత్తం 93 రకాల హంగులను జోడించామని లెక్ట్రిక్ పేర్కొంది.
Details
లెక్ట్రిక్స్ ఈవీ కోసం ఇప్పటికే రూ.300 కోట్లు ఖర్చు
ఈ బైక్స్ గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని 9 సెకన్లలో అందుకుంటాయి. గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్లు వేగంగా ప్రయాణించగలదు.
హర్యానాలోని మనేసర్ వద్ద ఉన్న ప్లాంట్ సామర్థ్యం ఏటా 1.5లక్షల యూనిట్లు కాగా, ఇప్పటికే లెక్ట్రిక్స్ ఈవీ కోసం ఎస్ఏఆర్ గ్రూప్ రూ.300 కోట్లు ఖర్చే చేసింది.
ఈ ఏడాది దాదాపు 50వేల యూనిట్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.
లుమినస్, లివ్‌గార్డ్, లివ్‌ఫాస్ట్, లివ్‌ప్యూర్ బ్రాండ్లను సైతం ఈ గ్రూప్ ప్రమోట్ చేయడం గమనార్హం.