Page Loader
అదిరే ఫీచర్లతో 2023 బెనెల్లీ TRK 502 వచ్చేసింది.. ధర ఎంతంటే?
అదిరే ఫీచర్లతో 2023 బెనెల్లీ TRK 502 వచ్చేసింది.. ధర ఎంతంటే?

అదిరే ఫీచర్లతో 2023 బెనెల్లీ TRK 502 వచ్చేసింది.. ధర ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2023
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెనల్లీ TRK 502 భారత మార్కెట్లోకి వచ్చేసింది. దీని ధర రూ.5.85 లక్షలు ఉంది. ఈ బైక్ బ్లూ, వైట్, గ్రే, గ్రీన్ కలర్లలో అందుబాటులోకి వచ్చింది. బెనెల్లీ 2017లో ప్రపంచవ్యాప్తంగా తన బైక్స్ ను పరిచయం చేసింది. లియోన్సినో 500 వలె ఇందులో 500cc, ట్విన్-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ బైకులో అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, అల్యూమినియం వీల్స్ ఉన్నాయి. డ్యూయల్-పాడ్ LED హెడ్‌లైట్, LED DRL, సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్, హ్యాండ్ గార్డ్‌లు, హీటెడ్ గ్రిప్‌లతో కూడిన హ్యాండిల్‌బార్, స్ప్లిట్-టైప్ సీట్లు, అండర్‌బెల్లీ ఎగ్జాస్ట్ వంటి ఫీచర్స్ తో ముందుకొచ్చింది. ఈ బైక్ 17-అంగుళాల అల్యూమినియం వీల్స్‌పై ప్రయాణించనుంది.

Details

బెనెల్లీ TRK 502 బైకులో అధునాతన ఫీచర్లు

2023 బెనెల్లీ TRK 502 ముందు భాగంలో నాలుగు-పిస్టన్ కాలిపర్‌లతో డ్యూయల్ 320mm సెమీ-ఫ్లోటింగ్ డిస్క్‌లు, డ్యూయల్-ఛానల్ ABSతో పాటు సింగిల్-పిస్టన్ కాలిపర్‌తో కూడిన పెద్ద 260mm డిస్క్‌తో వచ్చింది. 2023 బెనెల్లీ TRK 502 500cc, లిక్విడ్-కూల్డ్, 8-వాల్వ్, DOHC, సమాంతర-ట్విన్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 46.8hp శక్తిని గరిష్టంగా 46Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ముందువైపు 50 mm USD ఫోర్కులు, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. ఈ బైక్‌లో ముందువైపు వెనుకవైపు 260ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్, డ్యూయల్ 320ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి