Page Loader
అపాచి లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో అపాచీ ఆర్‌టీఆర్ 310 లాంచ్
అపాచి లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో అపాచీ ఆర్‌టీఆర్ 310 లాంచ్

అపాచి లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో అపాచీ ఆర్‌టీఆర్ 310 లాంచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2023
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీవీఎస్ మోటర్స్‌లో అపాచీ బైక్‌లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా అపాచీ బైకులకు యూత్ లో చాలా క్రేజ్ ఉంది. ప్రస్తుతం అపాచీ బైకులు 160సీసీ ఇంజన్ తో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలో 310 సీసీ ఇంజన్లు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 310 సీసీలో అపాచీ ఆర్ఆర్ 310 వెహికల్ మాత్రమే విక్రయంలో ఉంది. ప్రస్తుతం టీవీఎస్ మరో కొత్త 310 సీసీ బైక్ ను అపాచీ ఆర్ టీఆర్ పేరిట విడుదల చేయాలని చూస్తోంది. ఈ బైకులో డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్‌లు, స్ప్లిట్-టైప్ టెయిల్‌ల్యాంప్‌లు ఉంటాయి.

Details

అపాచీ ఆర్‌టీఆర్ 310 లో అధునాతన ఫీచర్లు

రైడర్ల భద్రత కోసం అపాచీ ఆర్టీఆర్ 310 బైకులో రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్ లతో పాటు డ్యూయల్-ఛానల్ ABS, రైడ్-బై-వైర్ థొరెటల్, బహుళ రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్, USD ఫ్రంట్ ఫోర్క్స్, స్లిప్పర్ క్లచ్, మోనోషాక్ రియర్ సస్పెన్షన్‌తో వెనుక డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు ఉంటాయి. KTM 250 డ్యూక్, హోండా CB300 R, 390 డ్యూక్‌ల బైకులతో అపాచీ ఆర్‌టీఆర్ బైక్ 310 పోటీ పడనుంది. అపాచీ ఆర్ఆర్ 310 ధర ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉంది. అయితే అపాచీ ఆర్‌టీఆర్ 310 బైక్ ధర అంతకంటే తక్కువగా లభించే అవకాశం ఉంది.