
యమహా ఎఫ్‌జెడ్ 25 Vs హీరో ఎక్స్‌ట్రీమ్ 200S 4V.. బెస్ట్ బైక్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
హీరో మోటోకార్ప్ తన ప్లాగ్‌షిప్ ద్విచక్ర వాహనాల్లో అప్‌డేటెడ్ ఫోర్-వాల్వే వర్షన్‌ను విడుదల చేసింది. హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్ 4వీని భారతదేశంలో రూ.1.41 లక్షల ధరతో రిలీజ్ చేశారు.
అదే విధంగా ప్రముఖ స్కూటర్ తయారీ సంస్థ యమహా ఇండియా యహహా ఎఫ్‌జెడ్ 25 బైక్ మార్కెట్లో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ రెండు బైకుల్లో ఏది బెస్ట్ ఆప్షనో మనం తెలుసుకుందాం.
హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ మూన్ ఎల్లో, పాంథర్ బ్లాక్ మెటాలిక్, ప్రీమియం స్టెల్త్ ఎడిషన్‌లలో రానుంది. ఇది మొదటి ఇంజిన్ కంటే.. 6 శాతం ఎక్కువ శక్తిని, 5 శాతం ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. అంతేకాకుండా ఇది నాలుగు-వాల్వ్ ఇంజిన్ తో ముందుకొచ్చింది.
Details
హీరో ఎక్స్‌ట్రీమ్ 200S 4Vలో శక్తివంతమైన ఇంజిన్
యమహా ఎఫ్‌జెడ్ 25లో మస్కులర్ 14-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్, వెడల్పాటి హ్యాండిల్ బార్, సొగసైన టెయిల్‌లాంప్, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్, స్ప్లిట్-స్టైల్ సీట్లు, LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.
హీరో ఎక్స్‌ట్రీమ్ 200S 4విలో 12.8-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, స్లిమ్ LED హెడ్‌ల్యాంప్, ఎత్తైన హ్యాండిల్‌బార్, ఫుల్ ఫెయిరింగ్‌లు, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్, స్టెప్-అప్ సీటు, LED టెయిల్‌ల్యాంప్‌ను కలిగి ఉంది. ఈ రెండు బైక్‌లు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తాయి.
భారతదేశంలో యమహా FZ 25 రూ. 1.51 లక్షలు ఉండగా.. హీరో ఎక్స్‌ట్రీమ్ 200S 4V రూ.1.41 లక్షలు ఉండనుంది. అయితే హీరో ఎక్స్‌ట్రీమ్‌లో శక్తివంతమైన ఇంజిన్‌తో అకర్షణీమైన లుక్ తో ముందుకొచ్చింది.