Toyota: ప్రపంచ చరిత్రలో సరికొత్త రికార్డు.. అంతర్జాతీయ మార్కెట్లో తిరుగులేని కంపెనీగా టయోటా
ఈ వార్తాకథనం ఏంటి
జపనీస్ ఆటో మొబైల్ దిగ్గజం టయోటా (Toyota) కార్ల తయారీలో నయా రికార్డును సృష్టించింది.
కంపెనీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ ఏ కంపెనీ ఉత్పత్తి చేయలేనన్ని కార్లను తయారు చేసి సరికొత్త మైలురాయిని అందుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో తిరుగులేని కంపెనీగా అవతరించిన టయోటా కేవలం జపాన్‌లో మాత్రమే 180.52 మిలియన్స్ కార్లను తయారు చేసింది.
ఇక ఇతర దేశాల్లో 119.6 మిలియన్ల కార్లు తయారైనట్లు తెలిసింది.
మొత్తం 88 సంవత్సరాల్లో ఇప్పటివరకూ కంపెనీ తయారు చేసిన కార్ల సంఖ్య ఏకంగా 300 మిలియన్స్ (30కోట్లు)
Details
అమ్మకాల్లో దూసుకుపోతున్న టయోటా
మరోవైపు టయోటా కంపెనీకి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచిన 'కొరొల్లా' ఉత్పత్తి మొత్తం 53.39 మిలియన్స్ కంటే ఎక్కువ.
1996 నుంచి ఈ సెడాన్ అనేక అప్డేట్స్ పొంది అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికీ అమ్మకాల్లో దూసుకుపోతోంది.
ఇక భారతీయ మార్కెట్లో కూడా టయోటా కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూ, అమ్మకాల్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.