Page Loader
వందశాతం ఇథనాల్‌తో నడిచే టయోటా కారు వచ్చేసిందోచ్.. పెట్రోల్ అవసరం లేదు
వందశాతం ఇథనాల్‌తో నడిచే టయోటా కారు వచ్చేసిందోచ్.. పెట్రోల్ అవసరం లేదు

వందశాతం ఇథనాల్‌తో నడిచే టయోటా కారు వచ్చేసిందోచ్.. పెట్రోల్ అవసరం లేదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 30, 2023
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ మార్కెట్లోకి టయోటా మోటర్ నుంచి ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ కారు వచ్చేసింది. ఈ టయోటా ఇన్నోవా కారును మంగళవారం కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిస్ గడ్కరీ ఆవిష్కరించారు. ఈ కొత్త కారు పూర్తిగా ఇథనాల్ తో నడవనుంది. ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిఫైడ్ ప్లెక్స్ ఫ్యూయల్ ప్రొటోటైప్ వెహికల్ ఇది. రెండో దశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా టయోటా ఇన్నోవా హైక్రాస్ రూపుదిద్దుకుంటోంది. సొంతంగా ఈ వెహికల్‌లో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ఇది ఈవీ మోడ్ లో కూడా పనిచేస్తుంది. ఇప్పటివరకు 83శాతం ఇథనాల్ బ్లెండ్‌తో నడిచే వాహనాలను రూపొందించారు. ప్రస్తుతం 100శాతం ఇథనాల్‌తో నడిచే తొలి వెహికిల్‌గా టయోటా ఇన్నోవా హై క్రాస్ రికార్డుకెక్కింది.

Details

ఇథనాల్ పంపుల ఏర్పాటుకు ఆదేశాలు

ప్రస్తుత మార్కెట్లో లీటర్ పెట్రోల్ రూ.109 ఉండగా, లీటర్ ఇథనాల్ సూమారు రూ.60 పలుకుతోంది. దేశ వ్యాప్తంగా పెట్రోల్ పంపులు ఉండగా, ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇథనాల్ పంపులు ఇంకా ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఇక పెట్రోలియం కంపెనీలు ఇథనాల్ పంపులను ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని నితిన్ గడ్కరీ కోరారు. పెట్రో ఉత్పత్తులకు బదులుగా పర్యావరణ సురక్షిత ఇంధనాలను వినియోగించే వాహనాలను అభివృద్ధి చేయాలని వాహన తయారీ సంస్థలను ఆయన కోరారు.