Most Expensive Car: భారతదేశంలో ఖరీదైన కారు వాడేది ఆమే.. ధరెంతో తెలిస్తే షాక్
దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం అనగానే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబాని భార్య కూడా నీతా అంబానీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడి భార్య అయినప్పటికీ ఆమె వంటగదికే పరిమితం కాకుండా భర్త, పిల్లలతో కలసి వ్యాపారం చేసుకుంటోంది. పారిశ్రామిక వేత్త, సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయురాలు వంటి అనేక పాత్రల్లో నీతా అంబానీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2016లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా నీతా గౌరవించబడ్డారు. 2022 నాటికి, నీతా అంబానీ ఆస్తులు 23,199 కోట్ల నుండి 24,856 కోట్ల మధ్య ఉన్నట్లు నివేదించబడింది.
Z ప్లస్ భద్రతతో కూడిన అల్ట్రా-లగ్జరీ కార్లు
ప్రతి ఏటా సగటున రూ.1.65 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్ టీమ్, కల్చరల్ సెంటర్ ఇలా ఎన్నో పనుల్లో బిజీగా ఉన్న నీతా అంబానీకి ప్రయాణించేందుకు విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. నీతా అంబానీకి Z ప్లస్ భద్రతతో కూడిన అల్ట్రా-లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB నీతా అంబానీ కొన్నారు. ఈ కొత్త లగ్జరీ కారు వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నీతా అంబానీ తన లగ్జరీ సెడాన్ కోసం రోజ్ క్వార్ట్జ్ కలర్ ఎంపికను ఎంచుకోవడం కూడా చాలా ఆసక్తికరమైన విషయం.
రోజ్ క్వార్ట్జ్ కలర్ ఆప్షన్‌లో నీతా అంబానీ కారు
ఈ రంగు భారతదేశంలోనే మొట్టమొదటి రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB కారుదే కావడం గమనార్హం. దీని స్టాండర్డ్ మోడల్ ధర దాదాపు రూ.12 కోట్లు. నీతా అంబానీ ప్రత్యేక రంగు ఎంపికను ఎంచుకోవడంతో,వాహనం ధర కూడా పెరిగింది. ఎందుకంటే ఇటువంటి కస్టమైజేషన్ పనులకు అదనపు ఖర్చు అవుతుందని రోల్స్ రాయిస్ ఇప్పటికే ధృవీకరించింది. అందువల్ల, నీతా అంబానీ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ ఖచ్చితమైన ధరను నిర్ధారించలేము. రోజ్ క్వార్ట్జ్ కలర్ ఆప్షన్‌లో వాహనం చూడటానికి చాలా అందంగా ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజ్ క్వార్ట్జ్ ఎక్స్‌టీరియర్‌తో కూడిన ఆర్కిడ్ వెల్వెట్ ఇంటీరియర్‌ను నీతా ఎంచుకుంది.ఫాంటమ్ అనేది బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఫ్లాగ్‌షిప్ మోడల్.
లగ్జరీకి చిహ్నంగా రోల్స్ రాయిస్ కారు
రోల్స్ రాయిస్ కార్లలో లగ్జరీకి చిహ్నంగా పిలువబడుతుంది. ఇందులో ఫాంటమ్ పాత్ర కూడా చాలా ఎక్కువ. EWB వెర్షన్ వెనుక సీటు ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ప్రయాణీకులకు గరిష్ట సౌకర్యాన్ని అందించడం సంస్థ అత్యంత ప్రాధాన్యత. కారు హెడ్‌రెస్ట్‌లపై నీతా ఇనీషియల్స్ (ఎన్‌ఎంఏ) కూడా ఎంబ్రాయిడరీ చేసినట్లు సమాచారం. వాహనంలో విస్కీ గ్లాసెస్, డికాంటర్, షాంపైన్ ఫ్లూట్‌లతో కూడిన డ్రింక్స్ క్యాబినెట్, ఫిక్స్‌డ్ రియర్ సెంటర్ కన్సోల్‌లో కూల్‌బాక్స్ ఉన్నాయి. దానితో పాటు, BMW తాజా 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కారులో ఉపయోగించబడింది. Rolls-Royce ఫాంటమ్ VIII EWB సెడాన్ డ్యాష్‌బోర్డ్ ప్రత్యేకమైనది అనలాగ్ క్లాక్.
నీతాకి దాదాపు 168కార్లు
జెడ్ ప్లస్ సెక్యూరిటీ పర్సన్ కావడంతో నీతా అంబానీ కొత్త కారుని ప్రత్యేకంగా తయారు చేయించారా అనేది తెలియరాలేదు. ఫాంటమ్ VIII EWB సెడాన్ 6.75 లీటర్ V12 ట్విన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.ఇది 571 బిహెచ్‌పి పవర్, 900ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్"శాటిలైట్ ఎయిడెడ్ ట్రాన్స్‌మిషన్"గా పిలువబడే GPS-ప్రారంభించబడిన 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. పైన చెప్పినట్లుగా,అంబానీ కుటుంబం ఖరీదైన కార్ల భారీ సేకరణను కలిగి ఉంది. ఆమెకు దాదాపు 168కార్లు ఉన్నాయని సమాచారం.ఇందులో అనేక రోల్స్ రాయిస్ ఫాంటమ్స్,గోస్ట్స్, కల్లినన్స్ కూడా ఉన్నాయి. గత సంవత్సరం దీపావళి సందర్భంగా,ముఖేష్ అంబానీ నీతా అంబానీకి సరికొత్త రోల్స్ రాయిస్ కాలినన్ బ్లాక్ బ్యాడ్జ్‌ని బహుమతిగా ఇచ్చారు.