Page Loader
ఏథర్ 450X ఎలక్ట్రికల్ స్కూటర్ల ధరల పెంపు.. ధ్రువీకరించిన సంస్థ
ఏథర్ 450X

ఏథర్ 450X ఎలక్ట్రికల్ స్కూటర్ల ధరల పెంపు.. ధ్రువీకరించిన సంస్థ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 22, 2023
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల కేంద్ర ప్రభుత్రం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీలను తగ్గించాలని నిర్ణయించింది. దీంతో 450X ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను జూన్ 1, 2023 నుండి పెంచనున్నట్లు ఏథర్ ఎనర్జీ ధ్రువీకరించింది. అయితే కొనుగోలు దారులు మే 31లోపల కొనుగోలు చేస్తే రూ. 32,500 వరకు ఆదా చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్ స్టాక్‌లు ముగిసే వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఫేమ్-2 కింద ఒక్కో ద్విచక్ర వాహనంపై భారీగా సబ్సిడి ఇస్తోంది. దీని గడుపు 2024 మార్చితో ముగియనుంది. దీనిపై ఏథర్ ఎనర్జీ CEO తరుణ్ మెహతా మాట్లాడుతూ EV పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ సబ్సిడీలపై కంపెనీలు ఆధారపడి ఉన్నాయన్నారు.

Details

ఎలక్ట్రిక్ వాహనాల ధరలకు రెక్కలు

2019లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రూ.30వేల సబ్సిడీ ఇవ్వగా, 2021లో దాన్ని 60వేలకు పెంచారన్నారు. ఆపై 2023లో రూ.22వేలకు తగ్గించారని గుర్తు చేశారు. సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తోందని తరుణ్ మెహతా వెల్లడించారు. కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో EV పరిశ్రమకు FAME పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ప్రోత్సాహకాలు ప్రధాన బూస్టర్‌గా మారాయి. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు 15 శాతం రాయితీని ప్రతిపాదించడంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలకు రెక్కలొచ్చాయి. ఏది ఏమైనప్పటికీ, FAME-2 ప్రోత్సాహకాలను తగ్గించడం, ఈవీ తయారీదారులు తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలను పెంచడంతో పరిశ్రమలు, ఈవీ కస్టమర్‌లు ఈ ప్రభావాన్ని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.