
Ather 450S: మార్కెట్లోకి ఏథర్ ఎంట్రీ లెవల్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 115 కిలోమీటర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ఏథర్ ఎనర్జీ సంస్థ మరో కొత్త ఈవీని లాంచ్ చేసింది.
ఈ స్కూటర్ ఓలా ఎస్1 ఎయిర్ కు పోటీగా ఏథర్ ఎనర్జీ సంస్థ తీసుకొచ్చింది. దీని ధర రూ.1.29 లక్షలుగా సంస్థ ధ్రువీకరించింది.
ప్రస్తుతం ఈ స్కూటర్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.. కొత్తగా తీసుకొచ్చిన ఏథర్ 450sలో 2.9 kWh బ్యాటరీని అమర్చారు.
ఈ స్కూటర్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 115 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ గంటకు 90 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని ఏథర్ ఎనర్జీ సంస్థ తెలిపింది.
450S ఎలక్ట్రిక్ స్కూటర్ లో 7.0 అంగుళాల టచ్ స్క్రీన్‌కు బదులుగా కలర్ LCD డిస్‌ప్లేను పొందుతుంది.
Details
ఏథర్ 450S లో అధునాతన ఫీచర్లు
450X మోడల్ ఇక నుంచి రెండు ఆప్షన్లతో రానుంది. ఒకటి సింగిల్ చార్జింగ్‌తో 115 కిలోమీర్ల రేంజ్ పనిచేస్తుంది. దీని ధర రూ.1.37 లక్షలు.
145 కిలోమీటర్ల రేంజ్ కలిగిన మోడల్ ధర రూ.1.44 లక్షలుగా సంస్థ నిర్ణయించింది.
Ather 450Sలో పనితీరు కోసం కంపెనీ ఒక ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించింది. ఇది 8.58 bhp శక్తిని, 26 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ స్కూటర్ కేవలం 3.9 సెకన్లలో 0-40 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. ఎలక్ట్రిక్ మోటారు శక్తిని అందించడానికి 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు.