Page Loader
బీఎండబ్ల్యూ నుంచి మరో సూపర్ బైక్.. రేపే బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ బైక్ విడుదల
బీఎండబ్ల్యూ నుంచి మరో సూపర్ బైక్.. రేపే బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ బైక్ విడుదల

బీఎండబ్ల్యూ నుంచి మరో సూపర్ బైక్.. రేపే బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ బైక్ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2023
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రీమియం కార్స్ ను ఉత్పత్తి చేసే కంపెనీ బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త బైకు రానుంది. BMW F 900 GSను రేపు మార్కెట్లో విడుదల చేయడానికి ఆ ఆటో మొబైల్ దిగ్గజ సంస్థ సిద్ధమైంది. రెండు రోజుల క్రితం ఈ బైక్‌కు సంబంధించిన ADV టీజర్‌ను సంస్థ రిలీవ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మోటర్ బైకు కొత్త ఇంజన్, ఛాసిస్‌ను కలిగి ఉంది. ఈ బైక్ F 850 ​​GS, F 750 GSలను సమర్థవంతంగా భర్తీ చేయనుంది. ఈ ద్విచక్ర వాహనం అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్‌లో గేమ్-ఛేంజర్‌గా మారడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ కొత్త బైక్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Details

బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ ధరను ప్రకటించని సంస్థ

కొత్త F 900 GS అడ్వెంచర్ బైకులో F 850 ​​GS డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఆల్-LED లైటింగ్ సెటప్, వైర్-స్పోక్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. కొన్ని అంతర్జాతీయ వెబ్‌సైట్‌లలో ఈ బైక్‌కు సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. ఇంజిన్, ఫీచర్లపై ఇంకా సంస్థ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే రేపు ఈ బైకు విడుదల కానున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ బైక్ కోసం ఇప్పటికే యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.