Aprilia RS 440: సెప్టెంబర్ 7న మార్కెట్‌లోకి అప్రిలియా RS440.. గంటకు 180 కి.మీ వేగం
స్పోర్ట్స్ వాహనాల తయారీకి ఆప్రిలియా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఇటాలియన్ కంపెనీ తన కొత్త సూపర్ బైక్ టీజర్‌ను సెప్టెంబర్ 7న గ్లోబల్ అరంగేట్రం చేయడానికి ముందు తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో విడుదల చేసింది. ఈ బైక్ 440 cc ఇంజన్,ప్రీమియం ఫీచర్లతో వస్తున్న ఈ సూపర్ స్పోర్ట్ బైక్ ధర దాదాపు రూ. 4.5 లక్షలు ఉండనుంది. సూపర్‌స్పోర్ట్‌లో అన్ని LED లైటింగ్ సెటప్, డిజైనర్ వీల్స్ ఉంటాయి. RS440 దాని రూపాన్ని పెద్ద, మరింత శక్తివంతమైన RS660 నుంచి తీసుకుంటుంది. ఇందులో ఫ్రంట్ ఫేస్ కాకుండా, సైడ్ ప్యానెల్స్, నారో టెయిల్ సెక్షన్, స్ప్లిట్‌సీట్లు, అండర్‌బెల్లీ ఎగ్జాస్ట్, ఓపెన్ ఫ్రేమ్ కూడా RS660ని పోలి ఉంటాయి.
మహారాష్ట్ర
బైక్‌లో స్ప్లిట్-టైప్ సీట్లు, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్, స్లిమ్ టెయిల్ సెక్షన్, TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, తేలికపాటి అల్లాయ్ వీల్స్ కూడా లభిస్తాయి. మహారాష్ట్రలోని బారామతి ఫెసిలిటీలో ఈ బైకును రూపొందిస్తున్నారు. RS440 కొత్త 440cc, సమాంతర-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది దాదాపు 45 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటారు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. దీని గరిష్ట వేగం గంటకు 180 కి.మీ ప్రయాణించగలదు. డ్యూయల్ ఛానల్ ABS, సింగిల్ ఫ్రంట్, రియర్ డిస్క్ బ్రేక్‌లను పొందుతుంది. ఈ బైకు కేటీఎం ఆర్సీ 390, కవాస నింజా 400లకు ఈ బైక్ గట్టి పోటీనివ్వనుంది.