Page Loader
DBS 770 అల్టిమేట్ కార్ లాంచ్ చేసిన వాహన తయారీ సంస్థ స్టన్-మార్టిన్
DBS 770 అల్టిమేట్ కారు 5.2-లీటర్ V12 ఇంజన్‌తో నడుస్తుంది

DBS 770 అల్టిమేట్ కార్ లాంచ్ చేసిన వాహన తయారీ సంస్థ స్టన్-మార్టిన్

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 19, 2023
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటిష్ వాహన తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ తన DBS 770 అల్టిమేట్ కారును లాంచ్ చేసింది. దీని ఉత్పత్తి 499 యూనిట్లకు పరిమితం అయింది. ఈ కారులో వివిధ టెక్నాలజీ ఆధారిత సౌకర్యాలతో ఉన్న సంపన్నమైన క్యాబిన్‌ ఉంది. ఇది 5.2-లీటర్ V12 ఇంజన్‌తో నడుస్తుంది. ఇది తమ సంస్థకు చెందిన అత్యంత శక్తివంతమైన ఉత్పత్తి అని కంపెనీ పేర్కొంది. ఈ బ్రాండ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దీనిని లాంచ్ చేసారు అయితే ఈ కార్ అన్ని యూనిట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయని సంస్థ తెలిపింది.

కార్

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది

ఆస్టన్ మార్టిన్ DBS 770 అల్టిమేట్ లో విలాసవంతమైన క్యాబిన్‌ తో పాటు స్పోర్ట్స్ ప్లస్ సీట్లు ఫ్లాట్-బాటమ్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌ ఉన్నాయి. ఇది గరిష్టంగా 340కిమీ/గం వేగంతో నడుస్తుంది. ఆస్టన్ మార్టిన్ DBS 770 అల్టిమేట్ ధర వివరాలు వెల్లడించలేదు.అయితే, USలో $333,686 (సుమారు రూ. 2.7 కోట్లు) ఉండే అవకాశముంది. ఈ కారు అన్ని యూనిట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. దీని ఉత్పత్తి 2023 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతుంది. ఈ ఏడాది చివర్లో డెలివరీలు ప్రారంభమవుతాయి.