Ather 450 X Apex : జనవరి 6న ఏథర్ 450 ఎక్స్ అపెక్స్ లాంచ్
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా మధ్యతరగతి కుటుంబాలు ఈవీ వాహనాల కొనుగోలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలా కంపెనీలు కొత్త కొత్త ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈవీ కంపెనీ ఏథర్ 450 ఎక్స్ అపెక్స్(Ather 450 X Apex) ను జనవరి 1న లాంచ్ చేయనుంది. కేవలం రూ.2,500 టోకెన్ అమౌంట్‌తో స్కూటర్‌ను కొనుగోలు చేయోచ్చు. భారతదేశంలో ఈ వెహికల్ డెలవరీలు మార్చి 2024లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.
3.3 సెకన్లలోనే 0 నుండి 40 కిలోమీటర్ల వేగం
450X అపెక్స్ కొత్త రైడింగ్ మోడ్ మరియు బ్రేక్ రీజెనరేషన్‌ను కలిగి ఉంటుంది. ఏథర్ 450 ఎక్స్ 26 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది 450X అపెక్స్ వార్ప్+ అనే కొత్త రైడింగ్ మోడ్‌ను పరిచయం చేయనుంది. ఇది 450Xలో ప్రస్తుత వార్ప్ మోడ్‌ను భర్తీ చేయనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ స్కూటర్ ఓ సారి చార్జ్ చేస్తే 150 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ వెహికల్ కేవలం 3.3 సెకన్లలో 0-40కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.