Page Loader
Ather 450S vs Ola S1 Air: ఈ రెండు ఈవీ స్కూటర్లలో ఏది బెటర్ అంటే? 
Ather 450S vs Ola S1 Air: ఈ రెండు ఈవీ స్కూటర్లలో ఏది బెటర్ అంటే?

Ather 450S vs Ola S1 Air: ఈ రెండు ఈవీ స్కూటర్లలో ఏది బెటర్ అంటే? 

వ్రాసిన వారు Stalin
Aug 14, 2023
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈవీ మోడల్‌లో బైక్ కొనాలనుకునే వారికి మార్కెట్లో రెండు బైకులు సరసమైన ధరలకు లభిస్తున్నాయి. అవే ఏథర్ 450ఎస్(Ather 450S), ఓలా ఎస్1 ఎయిర్(Ola S1 Air)బైకులు. ఈ బైకుల పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' భారతదేశంలో ఇటీవల మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను పరిచయం చేసింది. వాటిలో ఒకటి ఏథర్ 450ఎస్. దీని ధరను రూ.1.3 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా సంస్థ నిర్ణయించింది. ఓలా ఎస్1 ధర రూ.1.19లక్షలుగా ఉంది. ఈవీ మార్కెట్‌లో లీడర్‌గా ఎదగాలనే లక్ష్యంతో ఓలా సంస్థ 'ఎస్1 ఎయిర్'ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది.

బైక్

Ather 450S వర్సెస్ Ola S1 Air ఫీచర్లు ఇవే

Ather 450S ఒక ఆప్రాన్-మౌంటెడ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఫ్లష్-ఫిట్టెడ్ సైడ్ స్టాండ్, ఎల్ఈడీ టైలాంప్, 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, 7.0-అంగుళాల డీప్‌వ్యూ, ఎల్‌సీడీ డిస్‌ప్లేతో దీన్ని ప్రత్యేకంగా తీర్చిద్దారు. Ola S1 Air మోడల్ బైక్‌ ఎయిర్‌లో డ్యూయల్-పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, రబ్బరైజ్డ్ మ్యాట్‌తో కూడిన ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, స్లిమ్ ఎల్ఈడీ టెయిల్లాంప్, దిగువ బాడీలో బ్లాక్ క్లాడింగ్, 12-అంగుళాల స్టీల్ వీల్స్, 7.0-అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. ఏథర్ 450ఎస్ రెండు డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. భద్రత పరంగా కూడా దీన్ని మెరుగ్గా తయారు చేశారు. ఓలా ఎస్1 ఎయిర్ రెండు చక్రాలపై డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లు దీని సొంతం.

బైక్

ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏది ఎంత దూరం పోతుందంటే?

మెరుగైన రైడ్, హ్యాండ్లింగ్ లక్షణాలను నిర్ధారించడానికి, ఏథర్ 450ఎస్, ఓలా ఎస్1 ఎయిర్ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్)ని కలిగి ఉన్నాయి. ఏథర్ స్కూటర్(2.9kWh)ఒక్కసారి చార్జింగ్ చేస్తే 115కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఓలా స్కూటర్(4.5kW)ఒక్కసారి చార్జింగ్ పెడితే 125కిమీ ప్రయాణించవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్‌లను భారత మార్కెట్‌కు మొదట పరిచయం చేసిన సంస్థ ఏథర్ ఎనర్జీ. ఈ సంస్థ నుంచి వచ్చిన బైకులకు మంచి ఆదరణ ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ సంస్థ మాత్రం ఎస్1 ఎయిర్ మోడల్ కారణంగా ఈ-స్కూటర్ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఏథర్ ఎనర్జీ తీసుకొచ్చిన 450ఎస్ మోడల్ కారణంగా, ఈ రెండు కంపెనీలు ఆధిపత్యం కోసం పోటీ పడే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.