LOADING...
భారతదేశంలో 51 లక్షలకు అందుబాటులోకి రానున్న Audi  క్యూ3 స్పోర్ట్‌బ్యాక్
భారతదేశంలో Audi క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ప్రారంభం

భారతదేశంలో 51 లక్షలకు అందుబాటులోకి రానున్న Audi క్యూ3 స్పోర్ట్‌బ్యాక్

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 13, 2023
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్మన్ వాహన తయారీ సంస్థ Audi తన Q3 స్పోర్ట్‌బ్యాక్ కూపే SUVని భారతదేశంలో విడుదల చేసింది. ఇది ఒకే ట్రిమ్‌లో అందుబాటులో ఉంది. కారు స్టైలిష్ రూపంతో పాటు టెక్నాలజీ సపోర్ట్ తో సంపన్నమైన క్యాబిన్‌ తో వస్తుంది. ఇది 2.0-లీటర్ TFSI టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తుంది. Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ స్టాండర్డ్ Q3 కంటే చాలా ఖరీదైనది. ప్రస్తుతానికి దీనికి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేనప్పటికీ, బిం ఎమ్ డబ్ల్యూ X1, మెర్సిడెజ్-బెంజ్ GLA, Volvo XC40లతో పోటీ పడుతుంది. ఇది బ్లూ, నవర్రా బ్లూ, గ్లేసియర్ వైట్, మైథోస్ బ్లాక్, క్రోనోస్ గ్రే కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది 7.3 సెకన్లలో గంటకు 0-100కిమీల వేగాన్ని అందుకుంటుంది

కార్

ప్రయాణీకుల భద్రత కోసం క్రూయిజ్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ ఉన్నాయి.

Audi క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ 2.0-లీటర్ TFSI టర్బో-పెట్రోల్ ఇంజన్ పై నడుస్తుంది. ఇందులో ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, TPMS, వెనుక కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ ఉన్నాయి. భారతదేశంలో, Audi క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ స్పోర్ట్స్ ధర రూ. 51.43 లక్షలు (ఎక్స్-షోరూమ్) పరిమిత కాల వ్యవధికి ఐదు సంవత్సరాల పొడిగించిన వారంటీతో లభిస్తుంది. ప్రస్తుతానికి వాహనం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.