Page Loader
భారతదేశంలో Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్స్ ప్రారంభం
రూ.2 లక్షలు టోకెన్ మొత్తం చెల్లించి Audi Q3ని బుక్ చేసుకోవచ్చు

భారతదేశంలో Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్స్ ప్రారంభం

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 07, 2023
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్మన్ వాహన తయారీ సంస్థ Audi త్వరలో భారతదేశంలో తన Q3 స్పోర్ట్‌బ్యాక్ ను విడుదల చేయనుంది. రూ.2 లక్షలు టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు. భారతీయ మార్కెట్లో ఇది బి ఎం డబ్ల్యూ X1, వోల్వో XC40, మెర్సిడెజ్-బెంజ్ GLA తో పోటీ పడుతుంది. Q3 స్పోర్ట్‌బ్యాక్ మెష్ ప్యాటర్న్, సిల్వర్డ్ స్కిడ్ ప్లేట్లతో, స్ప్లిట్-టైప్ LED టైల్‌ల్యాంప్‌లతో వస్తుంది. లోపల పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వైర్‌లెస్ ఛార్జర్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటాయి. ఇది 2.0-లీటర్ TFSI ఇంజన్‌తో నడుస్తుంది. దీని ధర 44.89 లక్షలు నుండి రూ. 50.39 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

కార్

ఈ సెగ్మెంట్లో మార్కెట్లో పోటీ పడుతున్న అన్నీ బ్రాండ్ల ధరలు దాదాపు ఒకేలా ఉన్నాయి

వోల్వో XC40: ధర రూ. 45.9 లక్షలు ఉంటుంది. ఇది 48V ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్‌తో కనెక్ట్ అయిన 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది. 2023 బీ ఎం డబ్ల్యూ X1: ప్రారంభ ధర రూ. 45.9 లక్షలు, ఇది 1.5-లీటర్, మూడు-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్, 2.0-లీటర్, నాలుగు-సిలిండర్ డీజిల్ సపోర్ట్ చేస్తుంది. . మెర్సిడెజ్-బెంజ్ GLA: ప్రారంభ ధర రూ. 46.5 లక్షలు ఇది 1.3-లీటర్ పెట్రోల్ ఇంజన్, 2.0-లీటర్ డీజిల్ మోటారుపై నడుస్తుంది. ఈ సెగ్మెంట్లో మార్కెట్లో పోటీ పడుతున్న అన్నీ బ్రాండ్ల ధరలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇక Audi ఏ స్థాయిలో బుకింగ్స్ రాబట్టుకుంటుందో చూడాలి.